Lakshmi Narasimha: తెలంగాణ ఇలవేల్పు యాదగిరిగుట్ట.. అంగరంగ వైభవంగా యాదగిరి నరసన్న కళ్యాణం కనులారా తిలకించేందుకు ముక్కోటి దేవతలు యాదగిరి చేరుకున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా లక్ష్మీదేవి నరసింహస్వాముల కళ్యాణం కనుల పండుగలా వైభవంగా జరుగుతున్నది. స్వామివారి కల్యాణోత్సవం సర్వాంగ సుందరంగా శోబిల్లుతోంది. భక్తజనమంతా లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం ఘట్టాన్ని కనులారా చూడాలని ఎదురుచూస్తున్నారు..

ఆధ్యాత్మిక కళాక్షేత్రము… ముక్కోటి దేవతల స్వర్ణ నిలయం. ఆధ్యాత్మిక దైవ మందిరం. దివ్య క్షేత్రం అయినా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వర్ణ శోభితమైంది. విద్యుత్ దీపాల వెలుగులు విరజిమ్ముతూ క్షేత్ర పురం స్వర్ణ లోగిళ్ళలో దగదగలాడుతుంది. అశేష భక్త జనాన్ని కనువిందు చేస్తున్నది. లక్ష్మీదేవి నరసింహస్వామి కళ్యాణం గడియలు రానే వచ్చాయి. “నమో నరసింహ”
మంత్రంతో యాదగిరి గుట్ట క్షేత్రం మారుమోగుతుంది.
“శ్రీకర, శుభకరం, ప్రణభ స్వరూప, శ్రీలక్ష్మి నరసింహ నమో నమః”అంటూ జయ జయ ద్వారాలు మారుమోగుతున్నాయి. యువత జనం స్వామికి ప్రణమిల్లుతున్నది. స్వామికి నివేదించుకుంటే ఎంతటి కష్టాలు అయినా తొలగిపోతాయని నమ్మకం ఇక్కడ ఉగ్ర, గండబేరుండ, జ్వాలా, యోగానంద, లక్ష్మీ సమేత 5 రూపాయలలో నరసింహస్వామిని కొలుస్తారు.
దేశమంతా తెలంగాణ వైపు చూస్తున్నది. లక్ష్మీ నరసింహ పుణ్యభూమిని దర్శించుకోవడానికి సమస్త జనులు ప్రతిరోజు తరలివస్తారు. తెలంగాణ గడ్డమీద లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉండడం తెలంగాణ జనుల భాగ్యం. యాదగిరిగుట్టలో ఎటు చూసినా భక్తి భావంతో జనం మనసు ఉప్పొంగిపోతుంది. 14 లోకములన్నీ మొక్కే జ్వాలా నరసింహస్వామిని దర్శించడానికి భక్తజనులు ప్రపంచం నలుమూలలా నుంచి లక్షలాదిగా తరలివస్తుండడంతో తెలంగాణ మట్టి పులకించిపోతున్నది.
అపురూప శిల్ప సౌందర్యం..
ప్రపంచంలోనే మొదటి రాతి దేవాలయంగా లక్ష్మీనరసింహస్వామి గుడి నిర్మితమైంది. వేంచేపు మండలం, బ్రహ్మోత్సవ మండలం, అష్టభుజి ప్రాకారమండపాలను తీర్చిదిద్దారు. 100 సంవత్సరాలకు ముందు నిర్మించిన అనుభూతి భక్తులకు కలిగే విధంగా నిర్మించారు. ప్రస్తుత గర్భాలయాన్ని అలాగే ఉంచి దాని చుట్టూ గోడలను నిర్మించారు. మరియు నాలుగు రకాల ఆధ్యాత్మిక డిజైన్లతో సుందరంగా నిర్మాణాలని భక్తి భావాన్ని పెంచుచున్నాయి. అంతేకాకుండా 100 ఎకరాల అడవి నరసింహ అభయారణ్యంగా అభివృద్ధి. అమ్మవారి పేరు మీద 50 ఎకరాల్లో కళ్యాణమండపం కూడా నిర్మించారు…