సుప్రీం మెట్లెక్కిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ నిర్మాత

Share

ఢిల్లీ: రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం విడుదలను ఆంధ్రప్రదేశ్‌లో నిలిపివేయడంపై చిత్ర నిర్మాత రాకేశ్‌రెడ్డి సోమవారం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. చిత్రాన్ని రాష్ట్రంలో విడుదల చేయకుండా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విధించిన స్టేను ఎత్తివేయాలని రాకేశ్‌రెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ లో సినిమా ఖచ్చితంగా విడుదల అవుతుందని అన్నారు. సినిమాలో వాస్తవాలనే చూపించమని పేర్కొన్నారు. సెన్సార్ బోర్డు అనుమతిచ్చిన తర్వాత కూడా సినిమా విడుదల నిలివేయటం సరికాదని రాకేష్ రెడ్డి అభిప్రాయపడ్డారు. సుప్రీం కోర్టులో న్యాయం జరుగుతుందని భావిస్తున్నామన్నారు.

రాంగోపాల్‌ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం విడుదలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏప్రిల్ 3వ తేదీ వరకు స్టే విధించింది. సినిమా ప్రివ్యూను న్యాయమూర్తులు చూశాక, తదుపరి నిర్ణయం వెల్లడిస్తామని కోర్టు తెలిపింది. ఈ నేపథ్యంలో నిర్మాత రాకేశ్‌రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

అనుకున్న సమయానికి (మార్చి 29 ) ఆంధ్రాలో సినిమాను విడుదల చేయలేకపోయిన వర్మ తెలంగాణలో మాత్రం విడుదల చేశారు.


Share

Related posts

టిడిపి పార్టీ ని కొంప ముంచుతున్న కొత్త కమిటీలు..??

sekhar

రైతుకెందుకీ పట్టింపు… అసలు బిల్లులో ఏముందో తెలుసా?

Special Bureau

Sruthi Haasan : శృతిహాసన్ కోసం ఏకంగా అక్కడికెళ్లిన బాయ్ ఫ్రెండ్… వైరల్ గా మారిన ఫోటోలు..!

Teja

Leave a Comment