Deepti-shanmukh:గత కొన్ని వారాలుగా యూట్యూబ్ జంట అయినటువంటి షణ్ముఖ్ – దీప్తి గురించి సోషల్ మీడియాలో పలు రకాల కధనాలు రావడం మనం చూస్తూ వున్నాం. కాగా వీరి బ్రేకప్ వార్తను అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు అనే మాట వాస్తవం. ఈ క్రమంలో వారు బిగ్ బాస్ సిరిని టార్గెట్ చేయడం మనం చూశాం. ఈ మధ్యనే ఆ ట్రోల్స్ వార్ తగ్గుముఖం పట్టింది. ఓ వైపు ఫ్యాన్స్ మాత్రం మళ్లీ వారు కలుస్తే బాగుండు అంటూ సోషల్ మీడియాలో ఆశతో వారికి మెసేజెస్ పెడుతున్నారు.
Mahesh babu: ఈ విషయంలో కాంప్రమైజ్ కాని మహేశ్..అందుకే బ్లాక్ బస్టర్స్ మిస్ అవుతున్నాడు..
Deepti-shanmukh: దీప్తి సునైనాకి షణ్ముఖ్ చివరాఖరి ముద్దు ఇదే..
ఈ క్రమంలో తాజాగా షణ్నూ, దీప్తి జంటగా నటించిన హిట్ సాంగ్ ‘మలుపు’ మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో షణ్నూ, దీప్తి షూటింగ్‌ను తాలూక వీడియో క్లిప్పింగ్స్ మనం చూడవచ్చు. షణ్ను ఆస్పత్రి బెడ్‌పై పడుకుంటే అక్కడికి దీప్తి వచ్చి కొంచెం జరగమంటూ అతడి ఎదపై పడుకుంది. దీంతో షణ్నూ ‘నేను చనిపోయేటప్పుడు కూడా దీప్తి ప్లేస్ ఇవ్వమని అడుగుతుంది. జరగనివాటి గురించి ఎందుకు వాదిస్తుంది’ అని షన్ను చెప్పడంతో దీప్తి నవ్వుతూ అతడి ఎదపై వాలిపోయింది. ఆ తర్వాత షణ్ను ప్రేమగా ఓ ముద్దివ్వగా ఆమె కన్నార్పకుండా అతడిని అలానే చూస్తుండిపోయింది.
Prabhas: ప్రభాస్‌పై ఆ నిర్మాత చేసిన షాకింగ్ కామెంట్స్‌కు ఫ్యాన్స్ కన్ఫ్యూజన్లో పడ్డారు..!
ఇంకా వారి మధ్య జరిగిన రొమాంటిక్ సన్నివేశాలు ఇవే..
ఇక ఇలా వీరిద్దరూ కలిసి ఉన్న ఆ పాత క్లిప్పింగ్స్ ను చూసి ఫ్యాన్స్ చాలా ఎమోషనల్ అయిపోతున్నారు. ఈ క్రమంలో వారు ఆ వీడియో కింద చాలా రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. కేవలం 70 రోజుల రియాలిటీ షో వల్ల మీ భవిష్యత్తును పాడు చేసుకోకండని వారు సూచిస్తున్నారు. కాగా శనివారం అనగా జనవరి 8న రిలీజ్ చేసిన మలుపు మేకింగ్ వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌లో ఫుల్ వైరల్ అవుతోంది. కావాలంటే మీరు కూడా ఆ వీడియోని తిలకించవచ్చు.