Lasya and Ravi : లాస్య, రవి అనగానే మనం కొన్ని ఏళ్లు వెనక్కి వెళ్లాల్సిందే. అప్పట్లో వీళ్ల ఫ్రెండ్ షిప్పే వేరు. వీళ్లిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కానీ.. చాలామంది వీళ్లు లవర్స్ అని పొరపాటు పడ్డారు. ఇద్దరూ కలిసి కొన్ని వందల ప్రోగ్రామ్స్ చేశారు. కొన్ని వందల ఎపిసోడ్స్ లో ఇద్దరూ యాంకరింగ్ చేశారు. కానీ.. కొన్ని అనివార్య కారణాల వల్ల ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్ షిప్ కు బ్రేక్ పడింది.

తర్వాత ఎవరి లైఫ్ లో వాళ్లు బిజీ అయిపోయారు. లాస్య పెళ్లి చేసుకొని యాంకరింగ్ కు దూరమైపోయింది. రవి కూడా పెళ్లి చేసుకున్నాడు కానీ.. యాంకరింగ్ అలాగే కొనసాగించాడు. తర్వాత వీళ్లిద్దరి గురించి కూడా మాట్లాడుకోవడం మానేశారు అందరు.
తర్వాత లాస్య.. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడంతో మళ్లీ వీళ్లిద్దరి చర్చ బయటకు వచ్చింది. ఇద్దరూ సంక్రాంతి ఈవెంట్ లో కలవడం.. మళ్లీ మాట్లాడుకోవడంతో.. వీళ్ల అభిమానులు కూడా ఫుల్ ఖుషీ అయ్యారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య మళ్లీ ఫ్రెండ్ షిప్ చిగురించింది.
Lasya and Ravi : మరోసారి కామెడీ స్టార్స్ ప్రోగ్రామ్ లో మెరిసిన లాస్య, రవి
అయితే.. వీళ్లిద్దరూ మరోసారి కామెడీ స్టార్స్ ప్రోగ్రామ్ లో మెరిశారు. లాస్య, రవి.. ఇద్దరూ కలిసి ఉప్పెన సినిమా హీరోహీరోయిన్లుగా కాసేపు నటించాడు. లవ్యూ ఐ అని రవి ఓ పలక మీద రాయగా.. లవ్ యూ ఐ ఏంటి.. ఐ లవ్యూ కదా అని లాస్య అడగగా.. మనిద్దరి మధ్య లవ్ కూడా ఉండకూడదు.. అంటూ రవి చెప్పడం.. ఏంటో.. వీళ్లు యాక్ట్ చేస్తున్నారా? లేక జీవించేస్తున్నారా? అనే విషయం మాత్రం ప్రేక్షకులకు అర్థం కావడం లేదు.
దానికి సంబంధించిన ప్రోమో తాజాగా వచ్చేసింది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా కామెడీ స్టార్స్ ప్రోమోపై ఓ లుక్కేయండి.