Lasya Manjunath : లాస్య మంజునాథ్ తెలుసు కదా. అప్పుడు యాంకర్ గా.. ఇప్పుడు యూట్యూబర్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. బిగ్ బాస్ కంటే ముందు తన కెరీర్ కు బ్రేక్ ఇచ్చిన లాస్య.. తర్వాత బిగ్ బాస్ కి ఎంట్రీ ఇచ్చింది. దీంతో తన దశ మారిపోయింది.

ప్రస్తుతం తను ఫుల్ బిజీ స్టార్ అయిపోయింది. ఓవైపు టీవీ షోలు.. మరోవైపు తన సొంత యూట్యూబ్ చానెల్ ను నిర్వహిస్తూ తన అభిమానులకు టచ్ లో ఉంటోంది లాస్య.
లాస్య అంటేనే ఒకప్పుడు యాంకర్ గా అందరికీ సుపరిచితం. ఇప్పుడు వ్లాగర్ గా అందరినీ అలరిస్తోంది. తన పర్సనల్ వీడియోలను, ఇతర వీడియోలను పోస్ట్ చేస్తూ లాస్య ఫుల్ బిజీ అయిపోయింది.
Lasya Manjunath : తన భర్త బర్త్ డే వేడుకల కోసం గోవాకు చెక్కేసిన లాస్య
తన భర్త మంజునాథ్ బర్త్ డే వేడుకల కోసం లాస్య ఇటీవల గోవాకు వెళ్లింది. తన భర్త మంజునాథ్ బర్త్ డే వేడుకలను గోవాలోని కోల గోవా బీచ్ లో జరుపుకున్న తర్వాత లాస్య గోవా బీచ్ ల్లో ఫుల్ ఎంజాయ్ చేసింది. దానికి సంబంధించిన వీడియోను తాజాగా తన యూట్యూబ్ అకౌంట్ లో అప్ లోడ్ చేసింది లాస్య.
ప్రస్తుతం ఆ వీడియో యూట్యూబ్ లో సంచలనాలను సృష్టిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి.