Lasya Talks : లాస్య టాక్స్ Lasya Talks యూట్యూబ్ చానెల్ తెలుసు కదా. బిగ్ బాస్ లాస్య యూట్యూబ్ చానెలే ఇది. నిజానికి లాస్య ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిందో అప్పుడే లాస్యకు పాపులారిటీ పెరిగిపోయింది. తనకు బిగ్ బాస్ కంటే ముందే లాస్య టాక్స్ యూట్యూబ్ చానెల్ ఉన్నా.. అది అంతగా పాపులర్ అవ్వలేదు. కానీ.. ఎప్పుడైతే బిగ్ బాస్ లోకి లాస్య వెళ్లిందో ఇక చూసుకోండి.. తన గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. తన యూట్యూబ్ చానెల్ కు కూడా ఒక్కసారిగా సబ్ స్క్రైబర్స్ పెరిగారు. దీంతో తను పూర్తిగా యూట్యూబ్ చానెల్ మీద దృష్టి పెట్టింది.

ఓవైపు టీవీ చానెళ్లలో ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేస్తూనే తన యూట్యూబ్ చానెల్ లో వీడియోలు చేస్తోంది లాస్య. అలాగే.. లాస్య వెబ్ సిరీస్ లలోనూ నటిస్తోంది.
Lasya Talks : వెబ్ సిరీస్ షూటింగ్ లో తన షూటింగ్ పూర్తి చేసుకున్న లాస్య
అయితే.. లాస్య ప్రస్తుతం ట్విన్స్ అనే ఓ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఆ వెబ్ సిరీస్ షూటింగ్ తన ఇంట్లోనే నడుస్తోంది. అయితే.. ఒకరోజు తన ఇంట్లో షూటింగ్ జరుగుతుండగా.. కెమెరా రిపేర్ రావడంతో.. షూటింగ్ ఆగిపోయింది.
ఇక.. ఖాళీగా ఉండటం ఎందుకని తన యూట్యూబ్ వీడియోను తీసేసుకుంది. అది లాస్య అంటే. ఏమాత్రం టైమ్ వేస్ట్ చేయదు. తన అభిమానులను ఎప్పుడూ అలరిస్తూనే ఉంటుంది లాస్య. ఇంకెందుకు ఆలస్యం.. షూటింగ్ లో లాస్య షూట్ వీడియోను చూసేయండి.