Lasya Talks : చానెల్ తెలుసు కదా. యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు.. ఎక్కడ చూసినా బిగ్ బాస్ 4 కంటెస్టెంట్ లాస్య Lasya Talks వీడియోలే కనిపిస్తాయి. లాస్య ఎక్కువగా తన యూట్యూబ్ చానెల్ మీదనే ఫోకస్ పెట్టింది. కనీసం రోజుకు ఒక వీడియోను తన యూట్యూబ్ చానెల్ లో రిలీజ్ చేస్తోంది లాస్య. ఓవైపు యూట్యూబ్ చానెల్, మరోవైపు ఈవెంట్స్.. రెండింటినీ కవర్ చేసుకుంటూ తన సెకండ్ కెరీర్ లో సూపర్ ఫాస్ట్ గా ముందుకెళ్లిపోతోంది.
తన పర్సనల్ వీడియోలు, అవీ ఇవీ మాత్రమే కాకుండా.. ఇంటర్వ్యూ వీడియోలను కూడా చేస్తోంది. తనకు ఎలాగూ సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేయడం కొట్టిన పిండే కాబట్టి… సెలబ్రిటీలను పిలిచి ఇంటర్వ్యూలు చేసేస్తోంది. ఇప్పటికే పలు ఇంటర్వ్యూలు చేసిన లాస్య.. తాజాగా బంగారు బుల్లోడుతో ఇంటర్వ్యూ చేసింది.
అదేనండి.. బంగారు బుల్లోడు సినిమా హీరో.. అల్లరి నరేశ్ తో లాస్య ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో నరేశ్ కూడా తన సినిమాల విషయాలు, ఇతర విషయాలు.. అన్నింటినీ లాస్యతో పంచుకున్నాడు. లాస్య కూడా అల్లరి నరేశ్ గత సినిమాలు, తాజా సినిమా బంగారు బుల్లోడు గురించి చాలా విషయాలు అడిగింది.
మొత్తం మీద బంగారు బుల్లోడుతో ఇంటర్వ్యూ చేసి ఆ వీడియోను తన యూట్యూబ్ చానెల్ లో తాజాగా పోస్ట్ చేసింది లాస్య. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా బంగారు బుల్లోడు తన సినిమా గురించి ఏం కబుర్లు చెప్పాడో మీరే చూడండి.