Latest movies: బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా మిగులుతున్న కొత్త సినిమాలు..కరోనా నష్ఠాలను భర్తీ చేయడం కష్టమేనా..?

Share

Latest movies: గత ఏడాది నుంచి సినిమా ఇండస్ట్రీ తీవ్ర నష్ఠాలలో ఉన్న సంగతి తెలిసిందే. కరోనా విసిరిన పంజాకు వేల కోట్లలో ఇండస్ట్రీలకి నష్ఠం వాటిల్లిన సంగతి తెలిసిందే. అయితే ఆ నష్టాలను కొత్తగా వచ్చి బాక్సాఫీస్ వద్ద సందడి చేసే సినిమాలు భర్తీ చేస్తాయని అందరూ అంచనా వేస్తున్నారు. కానీ అది సాధ్యపడటం లేదు. చిన్న సినిమా, మీడియం బడ్జెట్ సినిమా..భారీ బడ్జెట్ సినిమా..ఏదైనా కూడా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేకపోతున్నాయి. దాంతో ఈ నష్టాలను భర్తీ చేసే సినిమాలు ఎప్పుడొస్తాయో అని విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు.

latest-movies-are in flops list at box office
latest-movies-are in flops list at box office

గత ఏడాది చివరిలో వచ్చిన మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన సోలో బ్రతుకే సో బెట్టర్ కాస్త ఇండస్ట్రీ వర్గాలలో ఆశలు కలిగేలా చేసింది. ఇక ఈ ఏడాది ప్రారంభంలో మాస్ మహారాజ రవితేజ – శృతి హాసన్ జంటగా..గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన క్రాక్ సినిమా భారీ లాభాలను అందుకొని ఇండస్ట్రీలో ప్రతీ ఒక్కరిలో ధైర్యం నింపింది. కథ బావుంటే జనాలు ఎలాగైనా మళ్ళీ థియేటర్స్‌కు వస్తారని క్రాక్ సినిమా నిరూపించింది. ఆ తర్వాత వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ఆ ఆశలకు ఇంకా బలాన్ని చేకూర్చింది.

Latest movies: భారీ అంచనాల మధ్య రిలీజైన మిగతా సినిమాలన్ని తీవ్రంగా నిరాశ పరుస్తున్నాయి.

అంతేకాదు నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లవ్ స్టోరి ఆంధ్రాలో నష్టాలను మిగిల్చిందనే టాక్ వినిపించింది. అయితే ఇక్కడ మాత్రం ఈ సినిమా మంచి లాభాలను తెచ్చిపెట్టింది. అలాగే అఖిల్ – పూజా హెగ్డేల మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ కూడా మంచి లాభాలను తీసుకువచ్చింది. ఇక ఇప్పటి వరకు మూడు సినిమాలు చేసినా కూడా ఓ భారీ హిట్ అందుకోలేని అఖిల్‌కు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ భారీ హిట్ ఇచ్చిందనే చెప్పుకుంటున్నారు. ఈ సినిమాలు తప్పితే భారీ అంచనాల మధ్య రిలీజైన మిగతా సినిమాలన్ని తీవ్రంగా నిరాశ పరుస్తున్నాయి.

నానికి గతకొంతకాలంగా హిట్ అనేది దక్కడం లేదు. ఇప్పటికే నిన్నుకోరి, మజిలీ లాంటి సినిమాలతో భారీ హిట్ అందుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ హ్యాట్రిక్ సినిమాగా నానితో టక్ జగదీష్ సినిమాను రూపొందించాడు. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమాతో నిర్మాతలకి పెద్దగా ఒరిగిందేమీ లేదని టాక్. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా అణ్ణాత్త సినిమా వచ్చింది. తెలుగులోనూ ఈ సినిమా పెద్దన్న అనే టైటిల్‌తో తీసుకువచ్చారు. ఓవర్సీస్‌లో ఇదే అత్యంత భారీగా రిలీజ్ అయిన తమిళ సినిమా. 1,100 థియేటర్స్‌లో రిలీజైంది.

Latest movies: తాజాగా వచ్చిన సినిమాలలో గొప్ప సినిమా అంటే ‘జై భీమ్’..

కానీ ఈ సినిమా ఫ్లాప్ టాక్‌ను మూటగట్టుకుంది. రజనీకి ఇది వరుసగా 5వ ఫ్లాప్ సినిమా అని చెప్పక తప్పదు. ఇక పూరి జగన్నాధ్ కొడుకు హీరోగా వచ్చిన రొమాంటిక్ సినిమాలో పాత మసాలా తప్ప ఏమీ లేదని చెప్పుకుంటున్నారు. అంతగా పూరి సినిమా మీద ఆసక్తి ఉన్నవాళ్ళు ఈసారి మాత్రం హీరోయిన్ కోసం వెళ్ళొచ్చు అని టాక్. మారుతి దర్శకత్వంలో తాజాగా మంచిరోజులు వచ్చాయి సినిమా వచ్చింది. ఈ సినిమా కూడా మారుతి మార్క్ హిట్ అందుకోలేదని ఫైనల్‌గా జనాలు డిసైడ్ చేశారు. తాజాగా వచ్చిన సినిమాలలో గొప్ప సినిమా అంటే కోలీవుడ్ స్టార్ హీరో నటించిన జై భీమ్ ఒక్కటి మాత్రమే. ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. భారీ లాభాలు మాత్రమే కాదు ..అవార్డులు దక్కడం ఖాయం అంటున్నారు.


Share

Related posts

ప్రీగా నెట్ ఫ్లిక్స్.. ఎలాగో తెలియాలంటే ఇది వెంటనే చదివేయండి!

Teja

ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ ఆయనని తీసుకు వస్తున్నారా ..?

GRK

Constipation: మలబద్ధకం.. వదిలించుకోండిలా..!!

bharani jella