Samantha: సమంత గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఇంతింతై వటుడింతై అన్నట్టు సామ్ దినదినాభివృద్ధి చెందుతున్న వైనం మనకు తెలిసినదే. ఎంతో కూల్ గా తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన సామ్ నాడు ఫైర్ బ్రాండ్ గా ఎదిగిన తీరు ఎంతో ప్రశంసనీయం. ‘ఏ మాయ చేసావే’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సామ్ నిన్నటి పుష్ప ‘ఊ అంటావా’ వరకు చేసిన సినిమాలు న భూతొ న భవిష్యతి. ఇక తాజాగా వరుణ్ ధావన్‌తో కలిసి తన బాలీవుడ్ ప్రాజెక్ట్ సిటాడెల్ కోసం ముంబై వెళ్లిన తర్వాత సమంత తిరిగి హైదరాబాద్‌కు వచ్చింది.
Samantha: ఇంట్లో కాకుండా అక్కడే ఉంటున్న సమంత..ఏమైందంటే?
Samantha: సమంత, అఖిల్ మేటర్:
ఇక ముంబై ఎయిర్పోర్ట్ లో ఎదురు పడిన సమంత, అఖిల్ మాట్లాడుకుంటారని మనం ఊహించగలమా? కానీ ఇక్కడ అదే జరిగింది. సామ్, చై విడిపోయి చాలా నెలలు కావస్తోంది. ఇరు కుటుంబాలవారు దాదాపు టచ్ లో లేరు. ఇలాంటి సమయంలో సమంత, అఖిల్ రిలేషన్ కూడా దాదాపు ముగిసిపోయిందనే అనుకున్నారు అందరూ. అయితే తాజాగా ఎదురు పడిన వీరు ఎంతో స్నేహ పూర్వకంగా మాట్లాడుకోవడం చాలా సంతోషకరమైన విషయం.
Samantha: సమంత జీవితాన్ని ప్రభావితం చేసింది వారేనట!
మరింత సమాచారం:
ఇక సామ్ దాదాపు వారం రోజుల తర్వాత ఆమె ఇంట్లోకి అడుగు పెట్టగానే ఆమె అందమైన పెంపుడు కుక్క పిల్లలు హష్ మరియు సాషా ఆమె వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చి వడిలో వాలిపోయాయి. ఈ వీడియోని తన ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది సామ్. ఇక ఆమె బాలీవుడ్ ప్రాజెక్ట్ విషయానికి వస్తే, గతంలో సమంతతో కలిసి, ది ఫ్యామిలీ మ్యాన్ 2లో పనిచేసిన దర్శకులు ‘రాజ్ మరియు డికె’ ఆమె తదుపరి హిందీ ప్రాజెక్ట్ సిటాడెల్‌కి ఎవెంజర్స్ ఫేమ్ ‘రస్సో బ్రదర్స్’తో కలిసి దర్శకత్వం వహిస్తున్నారు.