Siri: సిరి హన్మంత్ పరిచయం తెలుగు కుర్రకారుకి అక్కర్లేదు. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో అమ్మడు చేసిన రచ్చ అంతాఇంతా కాదు. దాంతో ఈమెకి నెగిటివ్ కోణంలో మంచి పాపులారిటీ దక్కింది. ఔను బిగ్ బాస్ హౌస్‌కి వెళ్లి ఉన్న కాస్త ఇమేజ్‌ని డ్యామేజ్ చేసుకున్న లిస్ట్ తీస్తే అందులో ఈమె పేరు ఖచ్చితంగా ఉంటుంది. బిగ్ బాస్ తెలుగు హిస్టరీలోనే సిరి హనుమంత్-షణ్ముఖ్ జస్వంత్‌ల వ్యవహారం ప్రేక్షకులకు కాస్త వెగటు పుట్టింది. ఈ క్రమంలో మొత్తం షోకే ఓ రకంగా చెడ్డపేరు వచ్చిందనే చెప్పుకోవాలి.
Siri: గ్రీన్ ట్రాన్సపరెంట్ శారీలో సిరి హన్మంత్.. కుర్రాళ్ళ మతులు పోగొడుతోంది!
Siri: మొదటికే మోసం అంటే ఇదే?
బిగ్ బాస్ హౌస్‌లో వీళ్లిద్దరదీ ముచ్చటైన జంట అని అందరికీ తెలిసిందే. అయినప్పటికీ అప్పటికే వీళ్లు వేరే వాళ్లతో లవ్‌లో ఉండటంతో బిగ్ బాస్ షోలో వీరి ఓవర్ యాక్షన్ బెడిసి కొట్టింది. దాంతో బీభత్సమైన నెగిటివిటీ ఏర్పడింది. షణ్ముఖ్ జస్వంత్ దీప్తి సునయనతో లవ్‌లో ఉంటే.. సిరి శ్రీహాన్‌తో ఎన్నేళ్లుగానో రిలేషన్లో ఉంది. అయితే బిగ్ బాస్‌కి వెళ్లిన తరువాత సీన్ మొత్తం మారిపోయింది. ఫలితంగా షణ్ముఖ్ బిగ్ బాస్ విన్నర్ అయ్యే ఛాన్స్‌ని కోల్పోయాడు. అలాగే సిరి-షణ్ముఖ్ వ్యవహారానికి దీప్తి ఏకంగా షణ్ణుకి బ్రేకప్ చెప్పేసింది.
Siri: పనిగట్టుకుని ఇన్ స్టాలో రవి వీడియో పెట్టిన సిరి హన్మంత్.. చాలా పెద్ద మ్యాటర్ దొరికింది!
సిరి ప్రస్తుత పరిస్థితి?
సిరి పరిస్థితి కూడా దాదాపు అంతే అనుకున్నారు. ఇద్దరూ దూరంగా ఉంటున్నారని కూడా పుకార్లు నడుస్తున్నాయి. అయితే తాజాగా ఇన్ స్టాగ్రామ్‌లో సిరి హనుమంత్ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. శ్రీహాన్‌తో కలిసిదిగిన ఫొటోను షేర్ చేస్తూ.. ఇలా రాసుకొచ్చింది.. “వాడు మాత్రమే నా లవ్.. మంచి చెడుల్లో నాకు అండగా ఉన్నాడు. నా బలం, నా మార్గదర్శి, నా సంరక్షకుడు.. నా సర్వస్వం అతనే. అతనిలో ఉన్న ప్రతిదాన్ని నేను ప్రేమిస్తా” అంటూ తన ప్రేమను ప్రకటించింది సిరి. దీంతో ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.