Sitara: సాధారణంగా ఏ సూపర్ స్టార్ అయినా, తన కుటుంబాన్ని మీడియా ముందుకు తేవడానికి అంతలా ఇష్టపడడు. మనం చూసుకుంటే మన తెలుగులోనే కొంతమంది హీరోల ఫ్యామిలీస్ గురించి ఇప్పటికీ మిస్టరీనే. ఈ విషయంలో ప్రిన్స్ మహేష్ బాబుని మెచ్చుకొని తీరాల్సిందే. తమ పిల్లల్ని చిన్ననాటి నుండే ఈ ప్రపంచానికి పరిచయం చేసాడు. అవును.. ముఖ్యంగా మహేష్ – నమ్రతల గారాల పట్టి సితార చేసే చిన్న చిన్న క్యూట్ మూమెంట్స్ ని తమ అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటూ వుంటారు.
Sirivennela Sitaramasastri: మరణాన్ని ముందే ఊహించిన సిరివెన్నెల
Sitara: తాజా స్వీట్ మూమెంట్ ఇదే:
ఇంతవరకు మనం సితార పాప పాటలు పాడడం, డ్యాన్స్‌లు చేయడం చూశాం. ఇక ఈ అమ్మడు హంగామా చూసి ఘట్టమనేని అభిమానులు అయితే తెగ పండగ చేసుకుంటారు. తన తండ్రి మహేష్ కి ధీటుగా ఫాలోయింగ్ పెంచుకుంటోంది సితార. ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో బోలెడంత పాపులారిటీ వచ్చేసింది. ఇప్పుడు సితార నీటి అడుగున ఈత కొడుతూ అందరికీ షాక్ ఇచ్చింది. తాజాగా ఈతలో మేటి అని నిరూపిస్తూ ఓ వీడియోని షేర్ చేసింది. కాగా ఈ వీడియో సోషల్ మీడియాలో దూసుకెళుతోంది.
Nirmala Sitaraman: బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త అందించిన కేంద్రం
సితార పోస్ట్ చూశారంటే ఇక అంతే:
సదరు ఫోటోలను షేర్ చేస్తూ.. నీటి అడుగున శ్వాసను బంధించే కళను గురించి కూడా చెప్పింది. “నీళ్ల కింద ఊపిరి పీల్చుకోవడం కష్టమే.. కానీ అదే మిమ్మల్ని మంచి ఈతగాడుగా చేస్తుంది!” అంటూ పాఠాలు చెబుతోంది. ఈ పోస్ట్ చుసిన నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. అనేకమంది పాపపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక సితార ఏం చేసినా తన టీచర్లు కోచ్ ల మార్గదర్శనంలోనే చేస్తుంది అని కొందరు, పిట్టకొంచెం, కూత ఘనం అని మరికొందరు.. సితారను ఆకాశానికెత్తేస్తున్నారు. తాజా ఈ ఫోటోషూట్ కి నమ్రతా శిరోద్కర్ – ఆమె సోదరి శిల్పా ముగ్ధులైపోయారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?