Sukibava: సుఖీభవ కుర్రాడి పై దాడి… అసలు మాటర్ ఏమిటంటే..?

Share

Sukibava: సోషల్ మీడియా యుగంలో ఎప్పుడు ఏది వైరల్ అవుతుందో తెలియడం లేదు. దీని పుణ్యమా అని కొందరు రాత్రికి రాత్రే నేషనల్ వైడ్, మరికొందరు స్టేట్ వైడ్ ఫేమస్ అయిపోతున్నారు. దీంతో వారి కెరీర్ కూడా ఒక్కసారిగా టర్న్ అయిపోతుంది. ఎక్కడికి వెళ్లినా జనం ఈజీగా గుర్తుపట్టేస్తున్నారు. అప్పట్లో టిక్‌టాక్ చేసిన యువతీ యువకులు చాలా మంది ఇప్పుడు షార్ట్ ఫిలిమ్స్‌లో నటిస్తూ యూట్యూట్‌లో మంచి క్రేజ్ సంపాదించారు. ప్రస్తుతం సోషల్ మీడియాను నమ్ముకున్న వారు ఎవరూ చెడిపోరని, ఇలా కొత్త అవకాశాలను దక్కించుకోవచ్చని మరో కుర్రాడు నిరూపించాడు. అతనే ‘సుఖీభవ శరత్’..


Bigg Boss 5 Telugu: ఈవారం ఇంటి నుండి ఎలిమినేట్ అవటానికి నామినేట్ అయిన సభ్యుల వివరాలు..!!

గాయాలతో కనిపించిన సుఖీభవ శరత్

‘అయ్యయ్యో వద్దమ్మా’ అనే ఒక్క డైలాగ్ శరత్‌ను ఓవర్ నైట్ స్టార్‌ను చేసిందని చెప్పవచ్చు. అయితే, ప్రస్తుతం అతనిపై ఎవరో దాడి చేశారని తెలుస్తోంది. అందుకు సంబంధించి శరత్ గాయాలతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయని అందరూ చెప్పుకుంటున్నారు. అతడిని రక్తం కారేలా, కొంతమంది తీవ్రంగా కొట్టారని తెలుస్తోంది. అయితే , దాడికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఏదో ఫంక్షన్‌లో గొడవ జరగగా శరత్‌ను కొందరు చితకబాదినట్టు తెలుస్తోంది. శరత్ హైదరాబాద్ నగరంలోని నల్లగుట్టలో నివాసముంటున్నాడు.

Tollywod Director: స్టార్ డైరెక్టర్ పని ఇక అయిపోయిందనుకున్న సమయంలో సాలీడ్ హిట్ తో కమ్ బ్యాక్..అందుకు కారణం వాళ్ళే..!

‘అయ్యయ్యో వద్దమ్మా’ అనే ఒక్క డైలాగ్..

కొన్నిరోజులుగా నెట్టింట ‘సుఖీభవ’ అనే వీడియో ట్రెండింగ్‌లో నిలచింది. దీనిపై విపరీతంగా ట్రోల్స్‌తో పాటు మీమ్స్ కూడా వినిపిస్తున్నాయి. నల్లగుట్టకు చెందిన శరత్‌.. ఓ యాడ్‌ను తనదైన స్టైల్లో రీమెక్ చేసి తీన్మార్‌ డ్యాన్సులు వేయడంతో ఇది వెలుగులోకి వచ్చింది. ఇంకేముంది ఆ వీడియో కాస్త వైరల్ అవడంతో అందరూ సుఖీభవ అంటూ ట్రోల్స్ చేసేస్తున్నారు.

ఎలా వైరల్ అయ్యిందంటే.. ఓ పెళ్లి బారాత్‌లో సరదాగా.. పక్కనే ఓ వ్యక్తి పాట పాడు అని అడగుగా శరత్ ‘అయ్యయ్యో వద్దమ్మా.. ఆ పక్కనే టీ కొట్టు పెట్టాను . అందరికీ ఓ కప్పు టీ ఇద్దామనుకున్నా.. డబ్బులు మాత్రం తీసుకుకోను.. ‘సుఖీభవ.. సుఖీభవ..’ అంటూ పాట పాడి తీన్మార్ స్టెప్పు లేశాడు.. ఆ తతంగాన్ని మొత్తం ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఎలా వైరల్ అయ్యిందో తెలీదు. కానీ రాత్రికిరాత్రే శరత్ ఫేమస్ అయ్యాడు.


Share

Related posts

జగన్ కోటలో కొత్త ఇక మెరుపులే..! ఆ ఐఏఎస్ వచ్చేసారు..! ఇక ఈ ఐపీఎస్..!!

Srinivas Manem

బ్రేకింగ్: కరోనా నుండి పూర్తిగా కోలుకున్న అమిత్ షా

Vihari

Bigg boss 4: సోహెల్, అఖిల్.. ఇద్దరూ మిత్రులా? లేక శత్రువులా?

Varun G