NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

గ్రేట‌ర్ పోలింగ్ఃరేపు ఏం జ‌ర‌గ‌నుందంటే…

bandi sanjay master plan to face cm kcr in ghmc elections

తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ‌ను రేకెత్తిస్తున్న గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల్లో చెవులకు చిల్లులు ప‌డేలా చేసిన ప్ర‌చారం ముగిసింది. రేపు (డిసెంబర్ 1వ తేదీ)న పోలింగ్ జ‌ర‌గ‌నుంది.

bandi sanjay master plan to face cm kcr in ghmc elections

 

ఇప్పటి వరకు మాటల మధ్య ఆరోపణలు, విమర్శలకు ఫులిస్టాప్‌ పడింది. సవాల్లు, ప్రతిసవాళ్లు, మైకుల హోరు నినాదాలు జోరుకు బ్రేక్‌ పడిపోగా ఇక, సైలెంట్‌గా తమ పని చేసుకోవడంపై అభ్యర్థులు ఫోకస్ పెట్టారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో డబ్బులు పంచుతూ.. వివిధ పార్టీలకు చెందిన నేతలు పట్టుబడ్డారు. ఇదే స‌మ‌యంలో అధికారులు పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఎన్నిక‌ల లెక్క ఇది…

గ్రేటర్ పరిధిలోని మొత్తం 150 వార్డుల బరిలో 1,122 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని తేల్చుకోనున్నారు. ఇందులో టీఆర్ఎస్‌ నుంచి 150, బీజేపీ 149, కాంగ్రెస్ 146, టీడీపీ 106, ఎంఐఎం 51, సిపిఐ 17, సిపిఎం 12, రిజిస్టార్డ్ పార్టీల అభ్యర్థులు 76, స్వతంత్రులు 415గా బరిలో ఉన్నారు. మొత్తం ఓటర్లు 74,67,256గా ఉండగా అందులో పురుషులు 38,89,637 మంది ఓటర్లు, స్త్రీలు 30,76,941, ఇతరులు 415గా ఉన్నారు. మొత్తం 36,404 సిబ్బంది పోలింగ్‌ విధుల్లో పాల్గొననున్నారు. పోలింగ్ అధికారులు 9101, సహాయ పోలింగ్ అధికారులు 9101, ఇతర పోలింగ్ సిబ్బంది 18,202 మంది విధులు నిర్వహిస్తారు. డిసెంబర్ 1వ తేదీ ఉదయం 7 గంట‌ల‌కు పోలింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రం 6 గంట‌ల‌కు పోలింగ్ పూర్తి అవుతుంది.

వాళ్లంతా వెళ్లిపోవాల్సిందే….

గ్రేటర్ ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. జీహెచ్ఎంసీ బయట నుంచి వచ్చిన వాళ్లు.. వెంటనే హైదరాబాద్‌ను విడిచి వెళ్లాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లు స్వచ్ఛందంగా వెళ్లి పోవాలని సూచించిన ఎన్నికల సంఘం… పోటీ చేస్తున్న వ్యక్తికి ఒకే వాహనానికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. ఏజెంట్లకు ప్రత్యేకంగా వాహనానికి అనుమతి లేదని స్పష్టం చేసింది. అభ్యర్థి వాహనంలోనే ఏజెంట్లు ప్రయాణం చేయొచ్చని సూచించింది. మరోవైపు.. ఇవాళ సాయంత్రం 6 గంటలకే మద్యం షాపులు క్లోజ్ కాగా.. డిసెంబర్ 1వ తేదీన సాయంత్రం 6 గంటల వరకు మద్యం అమ్మకాలు బంద్‌ చేయాల్సిందేనని స్పష్టం చేసింది.

author avatar
sridhar

Related posts

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju