యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో “ఆర్ఆర్ఆర్” చేస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ టైం మెగా హీరో రామ్ చరణ్ తో నందమూరి హీరో ఎన్టీఆర్ నటించడంతో ఈ సినిమా సౌత్ లోనే భారీ మల్టీస్టారర్ సినిమాగా పేరు సంపాదించింది. సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో అని దేశ వ్యాప్తంగా అందరికీ ఉత్కంఠ నెలకొంది.
కారణం “బాహుబలి” తర్వాత రాజమౌళి తీస్తున్న సినిమా కాబట్టి. ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తన కెరియర్ లో 30వ సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ పనులు ఎప్పుడో పూర్తి చేసిన త్రివిక్రమ్ తాజాగా సినిమాలో భారీగా తారాగణం ఉండే రీతిలో ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు టాక్ వస్తోంది.
ముఖ్యంగా రాజమౌళితో చేసిన తర్వాత ఎన్టీఆర్ చేయబోయే సినిమా కాబట్టి.. గతంలో మాదిరిగా ఫాల్ట్ రాకుండా స్క్రిప్ట్ విషయంలో అన్ని విషయాలలో సినిమా యూనిట్ చాలా జాగ్రత్త వహిస్తున్నట్లు సమాచారం. గతంలో ఎన్టీఆర్ సింహాద్రి అదేవిధంగా యమదొంగ సినిమాలు రాజమౌళితో చేయగా వాటి తర్వాత చేసిన సినిమాలు మొత్తం ఫ్లాప్ అవడం జరిగాయి. ఈ తరుణంలో ఆర్ఆర్ఆర్ తర్వాత ఇటువంటి రిజల్ట్ రిపీట్ అవ్వకుండా త్రివిక్రమ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఇదిలా ఉండగా ఈ సినిమాలో హీరోయిన్ విషయంలో అనేక వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ ప్రభాస్ తో “సాహో” సినిమాలో చేసిన శ్రద్ధాకపూర్ ని తీసుకోవడానికి త్రివిక్రమ్ రెడీ అయినట్లు ఇండస్ట్రీలో టాక్ వస్తోంది. అంతేకాకుండా పాన్ ఇండియా సినిమా తరహాలో చిత్రీకరించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మార్చి నెల చివరి వారం నుండి ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం.