దేశీయ మొబైల్స్ తయారీ కంపెనీ లావా కొత్తగా పల్స్ ఫీచర్ ఫోన్‌ను గురువారం విడుదల చేసింది. దీంట్లో బీపీ, హార్ట్ రేట్ సెన్సార్లను ఇచ్చారు. అందువల్ల బ్లడ్ ప్రెషర్, పల్స్‌ను తెలుసుకోవచ్చు. ఫోన్‌కు ముందు భాగంలో ఉన్న పల్స్ కీపై చేతి వేలిని ఉంచితే బీపీ, హార్ట్ రేట్ తెలుస్తాయి. అనంతరం ఆ వివరాలు ఫోన్ డిస్ప్లేపై ప్రత్యక్షం అవుతాయి. వాటిని ఫోన్లో స్టోర్ చేసుకోవచ్చు. లేదా ఇతర ఫోన్లకు మెసేజ్‌ల మాదిరిగా పంపుకోవచ్చు. ప్రపంచంలో ఈ ఫీచర్ కలిగిన తొలి ఫీచర్ ఫోన్ ఇదే..
లావా పల్స్ ఫీచర్ ఫోన్లో 2.4 ఇంచెస్ డిస్ప్లే ఇచ్చారు. 32 ఎంబీ వరకు ర్యామ్ ఉంది. మెమొరీని కార్డు ద్వారా 32 జీబీ వరకు పెంచుకోవచ్చు. దృఢమైన క్వాలిటీతో ఈ ఫోన్‌ను తయారు చేశారు. రెండు సిమ్‌లు వేసుకోవచ్చు. కానీ 2జి మాత్రమే పనిచేస్తుంది. బ్లూటూత్‌ను కూడా ఇచ్చారు. చార్జింగ్ కోసం మైక్రో యూఎస్బీ పోర్ట్ ఉంది.
ఈ ఫోన్లో కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. వైర్లెస్ ఎఫ్ఎం ఉంది. రేడియోను రికార్డ్ కూడా చేయవచ్చు. కాల్ రికార్డింగ్ ఫీచర్ ఇన్‌బిల్ట్‌గా ఉంది. 22 ఇండియన్ లాంగ్వేజెస్‌కు సపోర్ట్ ఉంది. 1800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నందున బ్యాకప్ 6 రోజుల వరకు వస్తుంది. రూ.1599 ధరకు ఈ ఫీచర్ ఫోన్‌ను కొనవచ్చు.