Telangana : న్యాయవాద దంపతుల దారుణ హత్య!పెద్ద చేతులే స్కెచ్ వేశాయని అనుమానాలు!!

Share

Telangana : తెలంగాణా లో దారుణం జరిగింది .హైకోర్టు న్యాయవాద దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కలవచర్ల గ్రామంలో ఈ ఘోరం చోటుచేసుకుంది.  కారులో హైదరాబాద్‌కు వెళ్తున్న హైకోర్టు న్యాయవాది గట్టు వామన్‌రావు,   నాగమణి దంపతులు హత్యకు గురయ్యారు. కారు ఆపి దంపతులిద్దరిని గుర్తు తెలియని వ్యక్తులు చంపేసి పరారయ్యారు. కారులోనే విచక్షణారహితంగా కత్తులతో నరికిచంపిన దుండగులు.

Lawyer Couple Murdered In Telangana
Lawyer Couple Murdered In Telangana

మంథని కోర్టులో ఓ కేసుకు హజరైన గట్టు వామన్​ రావు, నాగమణి దంపతులు తిరుగు ప్రయాణంలో హైదరాబాద్​ వెళ్తుండగా కల్వచర్ల శివారులో కారును అడ్డుకొని ఇద్దరిపై కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు.  చికిత్స పొందుతూ భార్య భర్తలు మృతి చెందారని తెలిపారు డాక్టర్లు. పక్క ప్రణాళికతోనే హత్య చేసినట్లు భావిస్తున్నారు పోలీసులు.  గట్టు వామన్​ రావుది మంథని మండలంలోని గుంజపడుగు గ్రామం. సంఘటన స్థలంలో చేతి గ్లౌజ్​లు లభ్యం అయ్యాయని తెలిపారు పోలీసులు.

Telangana  : ప్రాణ హాని ఉందని ముందే సీజేకు చెప్పుకున్న లాయర్

పెద్దపల్లి జిల్లాలో జరుగుతున్న పలు అక్రమాలపై హైకోర్డులో ఫిల్స్​ వేశారు గట్టు వామన్​రావు నాగమణి. ఈ క్రమంలోనే హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు పోలుసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఇటీవలే తమకు ప్రాణహాని ఉందని హైకోర్టు చీఫ్ జస్టీస్ కు తెలిపారు న్యాయవాది వామన్ రావ్. శీలం రంగయ్య లాక్ అప్ డెత్ కేసులో హైకోర్టు లో పిటీషన్ దాఖలు చేశారు వామన్ రావ్.

ఈ కేసులో హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ ను విచారణ అధికారిగా నియమించింది హైకోర్టు.కేసు వాపస్ తీసుకోవాలని గుర్తు తెలియని దుండగులు బెదిరింపులు చేశారు.రామగుండం సీపీ సత్యనారాయణతో వాగ్వాదానికి దిగారు వామన్ రావు.  గతంలో మాజీఎమ్మెల్యే పుట్ట మధుపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు న్యాయవాదులు.అయితే  చనిపోయే ముందు తనపై దాడి చేసింది కుంట శ్రీనివాస్ అని వామన్ రావు తెలిపారన్నారు పోలీసులు. మొత్తం మీద ఈ దంపతుల దారుణ హత్య వెనక పెద్ద హస్తాలే ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వామన్ రావు దంపతుల  మరణం పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది తెలంగాణ బార్ అసోసియేషన్.


Share

Related posts

సర్కారు కంట్లో “ఇసుక”..! కొత్త పాలసీకి సీఎం జగన్ సన్నాహాలు..!!

Special Bureau

‘అందుకే రాలేదు: ప్రమాణం చేయలేదు’

somaraju sharma

Bigg Boss Telugu 5: హౌస్ లో మరో కంటెస్టెంట్ తో బిగ్ ఫైట్ కి దిగిన.. ప్రియ ఆంటీ..!!

sekhar