NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ

ఆగస్టు 5…రామమందిరం భూమిపూజ..ఆ రోజే ఎందుకంటే..!

మోదీ కెరీర్ లో ఆ రోజుకున్న ప్రత్యేకత ఏంటి…పక్కా…ప్లానింగ్. ఒకదాని తరువాత మరొకటి సైలెంట్ గా…

అయోధ్య. అక్కడ రామాలయం. సుప్రీం కోర్టు అనుకూల తీర్పు వరకు దశాబ్దాల కాలంగా ఎన్నో మలుపులు..మరెన్నో వివాదాలు..ఎన్నో మార్పులకు సజీవ సాక్షి. కోట్లాది మంది మనోభావాలతో ముడి ఉన్న ఈ అంశం ఇప్పుడు సార్ధకమవుతోంది. సుప్రీం తీర్పుతో వివాదాస్పద భూమిపైన స్పష్టత రావటంతో..రామాలయం నిర్మాణానికి అడ్డంకులు తొలిగిపోయాయి. ఇక..ఇక్కడ రామాలయం నిర్మాణం కోసం భూమిపూజ కు ముహూర్తం నిర్ణయించారు. కరోనా వేళ..ఇప్పటికిప్పుడు ఈ ముహూర్తం ఏంటనే అభ్యంతరాలు ఉన్నాయి. కానీ, ఆగస్టు 5. అయోధ్యలో రామాలయం నిర్మాణానికి భూమి పూజ కోసం నిర్ణయించిన ముహూర్తం. ప్రధాని మోదీ సమక్షంలో జరిగే ఈ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోతుంది. అయితే, ఇదే ఆగస్టు 5న ముహూర్తంగా ఎంచుకోవటం వెనుక కీలక కారణాలు వెలుగులోకి వస్తున్నాయి. మంచిరోజు..మంచి ముహూర్తం తో పాటుగా ఆగస్టు 5 మోదీ సక్సెసివ్ కెరీర్ లో నిలిచిపోయే రోజు. అందుకే ఇప్పుడూ అదే రోజును ముహూర్తంగా ఎంచుకోవటం యాధ్రుచ్చికమే అయినా నమ్మి తీరాల్సిందే.

 

 

 

ఆగస్టు 5..మోదీకి మర్చిపోలేని రోజు…అయోధ్యలో రామాలయం ఆరెస్సెస్ తో పాటుగా శివసేన, వీహెచ్పీ, భజరంగ దళ్, హిందూ సంస్థల చిరకాల వాంఛ. అద్వానీ రధయాత్రతో ఈ అంశం దేశంలో వేడి పుట్టించింది. రాజకీయంగా అనేక మలుపుల కు కారణమైంది. బీజేపీకి ఆయుధంగా మారింది. ఇక, 2014 ఎన్నికల్లో గెలిచి ప్రధాని అయిన మోదీ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటూనే..ఆరెస్సెస్ ఎంతో కాలంగా దేశంలో అమలు చేయాలనుకుంటున్న అనేక కార్యక్రమాలను సైలెంట్ గా పూర్తి చేస్తున్నారు. అందులో భాగంగా ఇదే ఆగస్టు 5, 2019న ఎవరూ ఊహించని విధంగా ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ పార్లమెంట్ లో చట్టం చేసారు. ఒకే దేశం..ఒకే చట్టం అనే సుదీర్ఘ కాల నినాదాన్ని అమల్లోకి తెచ్చారు. జమ్ము కాశ్మీర్ పూర్తిగా భారతదేశ చట్టాలు వర్తించేలా చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న రోజు. ఇక, ఇప్పుడు అదే ఆగస్టు 5న.. సంవత్సరాల కాలంగా..బీజేపీ నమ్ముకొనే ప్రధాన ఓట్ బ్యాంకు సుదీర్ఘ నెరవేచ్చే క్రమంలో సుప్రీం తీర్పుతో రూట్ క్లియర్ అవ్వటంతో..ఎటువంటి వివాదాలకు తావు లేకుండా రామాలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహిస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దు.. రామాలయ నిర్మాణ ప్రారంభం ఈ రెండు ఆరెస్సెస్ చిరకాల వాంఛ. ఈ రెండూ సాధించిన క్రెడిట్ మోదీకి దక్కుతుంది. ఇక, గత ఏడాది ఏ రోజున అయితే ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకొచ్చారో..తిరిగి మరుసటి ఏడాది అంటే ఈ సంవత్సరం ఆగస్టు 5న తిరిగి అటువంటి చారిత్రాత్మక ఘట్టానికి మోదీనే కారణం.

చిరకాల వాంఛలు..ఒక్కోక్కటిగా అమలు చేస్తూ..ఇప్పటికే అయోధ్యలో పండుగ వాతావరణం నెలకొని ఉంది. ఆగస్టు 5న జరగే రామాలయ భూమిపూజ కోసం ప్రధానితో పాటుగా ప్రముఖులు హాజరవుతున్నారు. కరోనా వేళ ఇప్పుడు ఈ కార్యక్రమాలు ఏంటనే విమ్శలు రాజ్ థాక్రే వంటి వారి నుండి వినిపిస్తున్నాయి. మోదీ ప్రధాని అయిన తరువాత ఆరెస్సెస్ కోరుకున్నన విధంగా నిర్ణయాలను చాలా సైలెంట్ గా అమలు చేయటంలో సక్సెస్ అవుతున్నారు. ఆర్డికల్ 370 రద్దు..ట్రిపుల్ తలాక్ రద్దు..రామాలయం నిర్మాణం..జాతీయ విద్యా విధానంలో మార్పులు..విదేశాల్లో మత హింసకు గురైన హిందువులకు భారతీయ పౌరసత్వం..ఇలా అన్నింటినీ ఒకదాని తరువాత మరొకటి అమలు చేసేస్తున్నారు. ప్రతిపక్షాల బలహీనతే ప్రధాని మోదీకి బలంగా మారింది. ఆర్టికల్ 370 రద్దు చేసిన తరువాత ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందనే భయాలు తొలిగిపోయాయి. కరోనా పైన జాతిని ఉద్దేశించి ప్రసంగిచినా..మన్ కీ బాత్ లో సూచనలు చేసే ప్రధాని..కరోనా కల్లోలంలోనే…ఆగస్టు 5 అనే ప్రత్యేకమైన రోజున ..అయోధ్య రామాలయానికి భూమిపూజలో పాల్గొని మరో చరిత్రాత్మక అంశాన్ని తన ఖాతాలో జమ చేసుకోవాటానికి సిద్దమైపోయారు.

author avatar
Special Bureau

Related posts

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk