ప్లాస్టిక్ టెక్నాలజీ లో ఉన్నత చదువుల గురించి తెలుసుకోండి..!

 

ప్లాస్టిక్ టెక్నాలజీ అనేది ఒక ప్రత్యేకమైన అధ్యయనం యొక్క విభాగం, ఇందులో ప్లాస్టిసిటీని ప్రదర్శించే వివిధ రకాలైన రసాయనాల అధ్యయనం ఉంటుంది. మానవ జీవితంలో ప్లాస్టిక్‌ను ఉపయోగించగల అనేక పద్ధతుల అధ్యయనం కూడా ఇందులో ఉంటుంది.మీరు ప్లాస్టిక్‌ల గురించి సాంకేతికంగా బలంగా ఉంటే, మీరు ఆర్ అండ్ డి ఉద్యోగాలు కోరుకుంటే, మీరు విదేశాలలో అనుకున్నదానికంటే ఎక్కువ జీతం పొందుతారు. 6. ఇతర ఇంజనీరింగ్ స్ట్రీమ్‌ల కంటే అధ్యయనం చేయడం సులభం. మీరు దీనిని సిపెట్-చెన్నై లేదా అహ్మదాబాద్ నుండి కొనసాగిస్తే, బాలికలు, అబ్బాయిలకు ఇది చాలా మంచి కోర్సు.

 

 

ప్యాకింగ్, కంటేయినర్లు, ఆటోమొబైల్ తదితర ఎన్నో విభాగాల్లో ప్లాస్టిక్ వినియోగం పెద్దఎత్తున పెరిగింది. ప్లాస్టిక్ లేని జీవనాన్ని ఊహించుకోవడం కష్టమే. అందుకే పాలిమర్ల ప్రాసెసింగ్, డిజైనింగ్, డెవలప్మెంట్, ఉత్పత్తుల్లో కొత్త కొత్త విధానాలు అమలులోకి వస్తున్నాయి.

కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ( సీపెట్ ) నెలకొల్పారు. ఈ సంస్థ దేశవ్యాప్తంగా పలు కేంద్రాల్లో వివిధ స్థాయిల్లో కోర్సులను అందిస్తుంది. తాజాగా సీపెట్ కు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ టెక్నాలజీ (ఐపీటీ) ఇంటర్ విద్యార్థుల కోసం డిప్లొమా కోర్స్ ల్లో లేటరల్ ఎంట్రీ విధానంలో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది.

 

 

డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ మౌల్డ్ టెక్నాలజీ,డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ టెక్నాలజీ.లేటరల్ ఎంట్రీ డిప్లొమా కోర్స్ ల వ్యవధి రెండేళ్లు.ఇందులో చేరిన వారు మూడేళ్ళ డిప్లొమాలో రెండో ఏడాది కోర్స్ లోకి నేరుగా చేరవచ్చు. మొదటి మూడు సెమిస్టర్లు క్యాంపస్ తరగతులు ఉంటాయి. చివరి సెమిస్టరు సంబంధిత పరిశ్రమలో ఇంటర్న్ షిప్ ఉంటుంది. ఆగష్టు నుంచి తరగతులు మొదలవుతాయి. రెండేళ్ల కోర్సును విజయవంతంగా పూర్తి చేసుకున్నవారికి ఆటోమోటివ్ ప్యాకేజింగ్ కన్స్యూమర్ గూడ్స్ మెషిన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఆర్ అండ్ టీ ఇంజినీరింగ్ తదితర విభాగాలకు చెందిన సంస్థల్లో అవకాశాలు ఉంటాయి.