ఈ మధ్య చాలామంది యోగ మీద దృష్టి పెడుతున్నారు.యోగా జీవితం లో భాగంఅయితే ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. జీవితం సుఖంగా సాగిపోతుంది. అయితే, సరైన యోగా కోసం కచ్చితం గా క్లాసుల కి వెళ్లాలి. కానీ అంత టైమ్ లేదు అంటూ సాకులు చెప్పడం కాకుండా.. ఇంట్లోనే యోగాచేసుకోవచ్చు. అందుకోసం మనకి సహాయపడడానికి కొన్ని యాప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
పాకెట్ యాప్ : యోగాసనాలు వేయడంలో ఎన్నో సూచనలు ఇస్తుంది ఈ యాప్..ఏ ఆసనం ఎలా వేయాలో.. దాని వల్ల కలిగే లాభాలేంటోతెలియచేస్తుంది.
బ్రీత్ యాప్ : యోగా చేసే ముందు శ్వాస తీసుకుని, వదలడం చేస్తుండాలి. ఇలా చేయడం వల్ల ఆసనాల్లో ఎక్కువ సేపు ఉండడానికి వీలవుతుంది ..అందుకోసం ఈ బ్రీత్ యాప్ బాగా ఉపయోగపడుతుంది. ఇందులో.. శ్వాస ఎలా తీసుకోవాలి,ఎంతసేపు ఆపాలి అనేఅంశాలు స్పష్టంగా ఉంటాయి. రోజూ మనం అనుకున్న సమయానికి యోగా చేయొచ్చని ఈ యాప్ సూచిస్తుంది.యోగా గో యాప్.. ఈ యాప్లో ఫిట్నెస్తో పాటు అధిక బరువు తగ్గడానికి నియమాలు కూడా ఉంటాయి. సింపుల్ హాబిట్.. ఈ యాప్ మెడిటేషన్కి సంబంధించిన అన్ని విషయాలనుతెలియచేస్తుంది . ఒత్తిడి తగ్గించి , ఏకాగ్రతను పెంచి నిద్రలేమి సమస్యను లేకుండా చేస్తుంది .
5 మినిట్.. పని తో అస్సలు సమయం లేదు అనుకున్నప్పుడు కేవలం ఐదు నిమిషాల్లోనే చేసే యోగాసనాల కు సంబందించిన వివరాలు ఈ యాప్ ఇస్తుంది. ఇందు లోని ఆసనాలన్నీ ఆరోగ్యం గా ఉంచడం తో పాటు శరీరం చురుగ్గా పనిచేయడానికి ఉపయోగపడతాయి.
యోగా వేవ్ : ఈ యాప్ అప్పుడే యోగా నేర్చుకునే వారి దగ్గర నుండి నిష్ణాతులైన వారి వరకూ అందరికీ బాగా ఉపయోగపడుతుంది. ఇందు తెలియ చేయబడిన నియమాలు పాటిస్తే శరీరం చక్కగా.. ఫ్లెక్సీబుల్గా తయారవుతుంది. వీటిలో మీకు సరిపోయే యాప్ ను ఎంచుకుని ఫిట్ గా ఉండండి .
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?