Lemon: నిమ్మకాయ వలన ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే నిమ్మకాయ కూడా తినడానికి పుల్లగా చాలా రుచికరంగా ఉంటుంది. నిమ్మకాయలో ఎన్నో రకాల ఔషధ గుణాలు దాగి ఉన్నాయి.ముఖ్యంగా నిమ్మకాయలో అధికశాతంలో విటమిన్ సి ఉంటుంది కావున శరీరానికి రోగనిరోధక శక్తిని అందించడంలో బాగా పనిచేస్తుంది. అయితే చాలా మందికి నిమ్మకాయ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిసి ఉండకపోవచ్చు. మరి మనకు ఎంతగానో ఉపయోగపడే ఈ నిమ్మకాయ గురించిన విషయాలను తెలుసుకుందాం..
క్యాన్సర్ ను రాకుండా చేయడంలో నిమ్మ పాత్ర :
ప్రస్తుత కాలంలో క్యాన్సర్ వ్యాధి చాలా ప్రాణంతక వ్యాధిగా మారిపోయింది. ఈ మహమ్మారి బారిన పడి చాలామంది తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు.అయితే క్యాన్సర్ వ్యాధి వచ్చాక బాధపడకంటే క్యాన్సర్ రాకుండా ముందు జాగ్రత్త వహించడం మేలు. క్యాన్సర్ వ్యాధి నుండి నిమ్మకాయ మనల్ని రక్షిస్తుంది అనే విషయం మీలో చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు.కానీ ఇది నిజం.నిమ్మకాయలో ఉండే లెమనాయిడ్ అనే పదార్థం కొన్ని రకాల క్యాన్సర్ లను నివారిస్తుంది.
నిమ్మకాయ క్యాన్సర్ ను ఎలా అదుపు చేస్తుందంటే..?
అందుకే నిమ్మకాయను ఆహారంలో భాగంగా చేసుకోవాలి. ఒక గ్లాస్ నీటిలో కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి పొద్దునే తాగడం వలన బరువు తగ్గడంతో పాటుగా క్యాన్సర్ కూడా వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.నిమ్మకాయలో యాంటీ క్యాన్సర్ లక్షణాలు ఉంటాయి కనుక మొత్తం శరీరం మీద ప్రభావాన్ని చూపిస్తుంది.నిమ్మకాయలో సిట్రస్ పెక్టిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది రొమ్ము క్యాన్సర్, ప్రొటెస్ట్ గ్రంథి క్యాన్సర్ ను రాకుండా చేస్తుంది.నిమ్మలో ఉన్న ఫైటో న్యూట్రియన్స్ చాలా శక్తివంతమైనవి. ఇవి శరీరంలో వ్యాధి నిరోధకతను పెంచి కొన్ని రకాల క్యాన్సర్ లను కూడా నివారిస్తాయి.నిమ్మలో ఉండే 22 రకాల పదార్థాలు క్యాన్సర్ వ్యాధిని రాకుండా చేస్తాయి..