Breaking: బహ్రెయిన్ లో చిక్కుకొన్న తెలుగువారి కోసం విదేశాంగ మంత్రికి లెటర్ రాసిన సీఎం జగన్..!!

Share

Breaking: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విదేశాంగ మంత్రి జై జయశంకర్ కి లెటర్ రాయడం జరిగింది. బహ్రెయిన్ లో చిక్కుకొన్న తెలుగు ప్రజలను కాపాడాలని కోరుతూ లెటర్ రాశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి శ్రీకాకుళం జిల్లా ప్రాంతానికి చెందిన చాలామంది ప్రజలు బహ్రెయిన్ లో ఉపాధి కోసం వెళ్లటం జరిగింది. దీంతో కరోనా కారణంగా అక్కడ ఉపాధి లేక పోవటంతో శ్రీకాకుళం వలసదారులు నరకయాతన ఎదుర్కొంటున్నారు.

ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారడం తో అక్కడ వేధింపులు ఎదుర్కొంటున్న వారిని విదేశాంగమంత్రి కాపాడాలని తెలియజేస్తూ ఏపీ సీఎం జగన్ లెటర్ రాయడం జరిగింది. గతంలోనే ఈ విషయం గురించి వైసిపి సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా జయశంకర్ కి లెటర్ రాశారు. బహ్రెయిన్ లో చిక్కుకొన్న తెలుగు ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ సోషల్ మీడియాలో వీడియోలు కూడా పోస్ట్ చేయడం జరిగింది. దీంతో వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించాలని తెలియజేస్తూ సీఎం జగన్ తాజాగా బహ్రెయిన్ లో చిక్కుకున్న వారిని ఆదుకోవాలని లెటర్ ద్వారా కోరారు.


Share

Related posts

బిగ్ బాస్ 4 : వారినీ అందుకోసమా మొనల్ వెనక అభిజిత్ – అఖిల్ అంతలా పడుతున్నారు.

GRK

BIG BREAKING: మోడి గ్రీన్ సెగ్నల్ ఇచ్చాడు – చంద్రబాబు చారిత్రాత్మక పాదయాత్ర??

somaraju sharma

నిందితుడి ఇంట్లో పోలీస్ అధికారి సెల్ ఫోన్ లభ్యం

somaraju sharma