NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

ఎల్ఐసీ నుంచి అద్భుతమైన పాలసీ.. నెలకు 4 లక్షల పెన్షన్ పొందొచ్చు

ఎల్ఐసీ.. లైఫ్ ఇన్సురెన్స్ కార్పొరేషన్.. అంటే ప్రజల్లో ఓ నమ్మకం. అందుకే.. లైఫ్ ఇన్సురెన్స్ చేయించుకోవాలంటే ఎక్కువ మంది ఎల్ఐసీనే ఆశ్రయిస్తారు. దశాబ్దాల నుంచి వినియోగదారుల అభిమానాన్ని ఎల్ఐసీ చూరగొంటోంది.

lic jeevan shanthi pension policy to get pension after retirement

ఇక.. ఎల్ఐసీ సరికొత్త పథకాలను తమ కస్టమర్ల కోసం తీసుకొస్తుంటుంది. ఇప్పటి వరకు చాలా పాలసీలు వచ్చినా… కొత్తగా వచ్చిన జీవన్ శాంతి పాలసీ పెన్షన్ కావాలనుకునేవారికి అద్భుతమైన పాలసీ.

జీవన్ శాంతి పెన్షన్ పాలసీ ద్వారా నెలకు పెన్షన్ రూపంలో 4 లక్షల రూపాయల వరకు పొందొచ్చు. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవాళ్లు.. తమ పదవీ విరమణ తర్వాతి జీవితం గురించి ఆలోచిస్తుంటారు. అటువంటి వాళ్లకు ఇది బ్రహ్మాండమైన పాలసీ. ఈ పాలసీ చేయించుకుంటే పాలసీదారు జీవించి ఉన్నంత కాలం పెన్షన్ వస్తుంది.

అంతే కాదు.. పాలసీ ప్రారంభించిన వెంటనే పెన్షన్ పొందే అవకాశం ఈ పాలసీలో ఉంది. ఈ పాలసీలో పలు రకాల పద్ధతుల్లో ప్రీమియాలు చెల్లించవచ్చు. ఒకేసారి ప్రీమియం డబ్బు చెల్లిస్తే వెంటనే పెన్షన్ డబ్బులు పొందే అవకాశం ఉంటుంది. లేదంటే 5 ఏళ్లు, 10, 15, 20 ఏళ్ల తర్వాత పెన్షన్ కావాలనుకుంటే ఆ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవచ్చు.

ఈ పాలసీలో పాలసీదారునికి నచ్చిన ఆప్షన్ ను ఎంచుకునేలా మొత్తం 12 ఆప్షన్లను పొందుపరిచారు. కనీసం 30 ఏళ్లు ఉంటేనే ఈ పాలసీకి అర్హులు. గరిష్టంగా 85 ఏళ్ల వయసు వరకు ఉండాలి.

కనీసం లక్షన్నరతో కూడా పాలసీని తీసుకోవచ్చు. ఇక.. ఈ పాలసీకి ఇన్ కమ్ టాక్స్ లా 1961, సెక్షన్ 80సీ ప్రకారం పన్ను మినహాయింపు లభిస్తుంది.

ఉద్యోగం తర్వాత జీవితం హ్యాపీగా ఉండాలి అనుకుంటే.. అంతో ఇంతో పెన్షన్ రావాలి అనుకుంటే వెంటనే ఈ పాలసీని తీసుకోవచ్చు.

author avatar
Varun G

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!