29.2 C
Hyderabad
March 21, 2023
NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

LIC ప్లాన్.. రూ. 1280 ఆదాతో ప్రతి ఏడాది రూ.40 వేల పెన్షన్..!!

LIC jeevan umang policy
Share

LIC : దేశీయ బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు తన వినియోగదారుల కోసం కొత్త కొత్త ప్లాన్లను అందిస్తుంది.అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..దీర్ఘకాలిక పెట్టుబడులపై అధిక రాబడి కావాలనుకునే వారికి ఎల్ఐసి “జీవన్ ఉమాంగ్ ప్లాన్” ను అందిస్తుంది.

LIC jeevan umang policy
LIC jeevan umang policy

దీనిలో పెట్టుబడుల ద్వారా మంచి రాబడితో పాటు, పాలసీదారులు మరణించిన సందర్భంలో వారి కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది. పైగా దీనిలో పెట్టుబడులకు చెల్లించే ప్రీమియం ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80c కింద పన్ను మినహాయింపులను పొందవచ్చు.

8-55 సంవత్సరాల మధ్య వయసు గల వ్యక్తులు ప్లాన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పాలసీకి కనీస హామీ మొత్తం రూ. 1,00,000.. గరిష్ట పరిమితి ఏమీ లేదు. దీనిలో 100 ఏళ్ల వరకు పాలసీ కవరేజ్ ఉంటుంది. ఉదాహరణకు 30 ఏళ్ల వ్యక్తి ఈ ప్లాన్ లో రూ.5 లక్షల బీమా మొత్తానికి నెలకు రూ.1280 ను 30 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించాలి. 60 ఏళ్ళు వచ్చిన తర్వాత ప్రతి ఏడాది రూ. 40,000 వస్తాయి. పాలసీదారులు మధ్యలో మరణిస్తే వారి కుటుంబానికి ప్రయోజనాలను అందిస్తారు. అంతేకాకుండా LIC ప్రకటించిన గ్యారెంటీ జోడింపులు, లాయల్టీ జోడింపులు ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో పాలసీపై లోన్ పొందే అవకాశాన్ని కూడా పాలసీదారులకు అందిస్తారు. ఇంకా ఇతర పూర్తి వివరాల కోసం అధికార వెబ్సైట్ గాని, బ్రాంచ్ లేదా ఏజెంట్ ని సంప్రదించవచ్చును.


Share

Related posts

Mansas Trust: హైకోర్టు తీర్పుపై అశోక్ గజపతిరాజు స్పందన ఇదీ..!!

somaraju sharma

ఒక టీకా.. వేయి ప్రశ్నలు..!రష్యా తొందరపడిందా..?

somaraju sharma

YS Sharmila: కాంగ్రెస్ పార్టీ పై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

somaraju sharma