Subscribe for notification
Categories: న్యూస్

LIC పాలసీదారులారా టెన్షన్ పడకండి.. సదరు పాలసీలను రెన్యువల్​ చేసుకునే అవకాశం వుంది!

Share

LIC : ప్రముఖ బీమా సంస్థ దిగ్గజం అయినటువంటి (లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) తన పాలసీదారులకు ఓ శుభవార్త చెప్పింది. అదేమంటే, గతంలో రకరకాల కారణాలతో ల్యాప్స్​ అయిన పాలసీలను రెన్యువల్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. కరోనా పుణ్యమాని జీవిత బీమా కవరేజీకి మరింత ఎక్కువ ప్రాధాన్యం పెరిగింది.

ఈ నేపథ్యంలో పాలసీదారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని LIC ఈ ఆఫర్​ ప్రకటించింది. అయితే, ఇక్కడ ఓ నియమ నిబంధన వుంది. ప్రస్తుతం ల్యాప్‌డ్ కండిషన్‌లో ఉండి, పాలసీ టర్మ్‌ను పూర్తి చేయని వాటిని మాత్రమే కన్సిడర్ చేస్తారు. వారికి మాత్రమే ఈ రెన్యువల్ అవకాశం వుంది.

LIC : ఈ అవకాశం ఎప్పటినుండి ఎప్పటివరకు?

నిన్నటినుండి అనగా ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభమయ్యే ఈ క్యాంపెయిన్​ మార్చి 25న ముగియనుంది. ఈ గడువులో పాలసీ రెన్యువల్​కు చేసుకోవాలని వచ్చే వారికి ఆలస్య రుసుములో రాయితీ కూడా ఇస్తామని LIC ప్రకటించడం గమనార్హం. అలాగే ఇంకోవైపు మైక్రో ఇన్సూరెన్స్​ పాలసీలకు ఆలస్య రుసుమును పూర్తిగా మినహాయిస్తున్నట్లు LIC ప్రకటించడం హర్శించదగ్గ విషయం. నిలిచిపోయిన ప్రీమియం విలువ రూ. 1 లక్ష వరకు ఉంటే ఆలస్య రుసుములో 20 శాతం, గరిష్టంగా 2,000 వరకు రాయితీ ఇవ్వనున్నట్లు పేర్కొంది.

మరిన్ని వివరాలు:

ఈ సందర్భంగా LIC కరోనా కష్టకాలంలో ఇన్సూరెన్స్​ పాలసీ యెక్క ప్రాముఖ్యతను వివరిస్తోంది. సదరు కుటుంబాలకు ఆర్థిక భద్రతను ఇవ్వడానికి ల్యాప్స్​ అయిన ఖాతాలను రెన్యువల్​ చేసుకునే ఆప్షన్ కల్పిస్తున్నామని చెబుతున్నారు. కాబట్టి పాలసీదారులారా! మీ పాలసీలను రెన్యువల్​ చేసుకునేందుకు ఇది చాలా మంచి తరుణం. ఈ అవకాశాన్ని పాలసీదారులు ఉపయోగించుకోవాలని న్యూస్ ఆర్బిట్ వేదికగా కోరుతున్నాం.


Share
Ram

Recent Posts

CM YS Jagan: ప్రధాని మోడీకి ప్రధాన అంశాలపై సీఎం వైఎస్ జగన్ వినతి.. ఈ సారి అయినా మోడీ మోక్షం లభిస్తుందా..?

CM YS Jagan: భీమవరం పర్యటన పూర్తి చేసుకుని గన్నవరం విమానాశ్రయం వద్ద తిరుగు ప్రయాణం అయిన ప్రధాన మంత్రి నరేంద్ర…

2 hours ago

Somu Veerraju: మోడీ పర్యటన సందర్భంగా దుష్టశక్తుల భారీ కుట్ర అంటూ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు

Somu Veerraju: ప్రధాన మంత్రి నరేంద్ర భీమవరం పర్యటన సందర్భంలో నిరసన తెలిపేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమైయ్యారు. గన్నవరం విమానాశ్రయం నుండి…

2 hours ago

Peanut Rice: ఎదిగే పిల్లలకు పీనట్ రైస్ చేసి పెట్టండి.. బలానికి బలం రుచికి రుచి..!

Peanut Rice: వేరుశనగ ఆరోగ్యానికి మంచిదని అందరికీ మంచి తెలిసిందే.. అందుకే పల్లి చెక్కలు, పల్లి ఉండలు, వేరుశనగ పచ్చడి,…

3 hours ago

AP Minister RK Roja: మంత్రి రోజా సెల్ఫీ ఫోటోకు నవ్వుతూ ఫోజు ఇచ్చిన ప్రధాని మోడీ

AP Minister RK Roja: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతోత్సవాల సందర్భంగా అజాదీగా అమృత్ ఉత్సవ్ లో…

4 hours ago

Race Gurram: మరోసారి రేసుగుర్రం కాంబినేషన్ రిపీట్..??

Race Gurram: 2014వ సంవత్సరంలో డైరెక్టర్ సురేందర్ రెడ్డి(Surender Reddy) దర్శకత్వంలో ఐకాన్ స్టార్ హీరోగా నటించిన "రేసుగుర్రం"( Race…

5 hours ago

SSMB28: కన్నడ స్టార్ హీరోతో కలసి మహేష్ బాబు..??

SSMB28: సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) "సర్కారు వారి పాట"(Sarkaru Vari Pata) విజయంతో మంచి జోరు మీద…

6 hours ago