Liger – Pushpa: బిజినెస్‌లో పుష్పను మించిపోయిన లైగర్..ఇండస్ట్రీలో ఇదే టాప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు మొదలై చక్కర్లు కొడుతున్నాయి. టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో లైగర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సాలా క్రాస్ బ్రీడ్ అనే ట్యాగ్ లైన్ పెట్టడంతోనే ఈ మూవీ ఏ రేంజ్లో ఉండబోతుందో హింట్ ఇచ్చేశారు. పూరి మార్క్ మేకింగ్, విజయ్ మార్క్ పర్ఫార్మెన్స్తో లైగర్ బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులపడం ఖాయమని అందరూ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసినప్పటి నుంచే చెప్పుకుంటున్నారు.
ఇక ఈ సినిమాను పూరి జగన్నాథ్ పాన్ ఇండియా సినిమాగా తెలుగుతో పాటు, మలయాళం, కన్నడ, తమిళం, హిందీ భాషలలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తోంది. అంతేకాదు, ఆమె సౌత్ భాషలలో ఎంట్రీ ఈ రేంజ్లో ఇవ్వడం అంటే గొప్ప విశేషం. పూరి హీరోయిన్స్‌ను ఏ రేంజ్లో చూపిస్తారో అందరికీ తెలిసిందే. కాబట్టి లైగర్ గనక పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ సాధిస్తే మాత్రం పక్కా అనన్యకు సౌత్ సినిమా అన్నీ భాషలలో విపరీతమైన క్రేజ్ వచ్చేస్తుంది.
ఇక ఇప్పటికే లైగర్ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ అభిమానులతో పాటు అన్నీ వర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దాంతో సినిమాపై అన్నీ భాషలలోనూ భారీగా అంచనాలు పెరిగాయి. ఇక తాజాగా లైగర్ సినిమా బిజినెస్ చూస్తే కళ్ళు చెదిరిపోతున్నాయని చెప్పుకుంటున్నారు. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ఫ్యాన్సీ ధరకి అమ్ముడయ్యాయని లేటెస్ట్ న్యూస్. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ న్యూస్ అవుతోంది. దిగ్గజ ఓటిటీ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు లైగర్ మూవీని రూ. 60 కోట్లుకు కొనుగోలు చేశారట. పుష్ప డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ రూ. 30 కోట్లుకు సొంతం చేసుకున్నారు. అయితే ఇప్పుడు దానికి రెండింతలు లైగర్ సినిమాకి ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది.
Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) అందరికీ సుపరిచితుడే. "చిత్రం"(Chitram) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్…
Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఓ మలయాళ చిత్రంతో సినీ కెరీర్‌ను…
Pavitra Lokesh Naresh: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెను…
Gopichand-NTR: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ రెండు రోజుల క్రితమే `పక్కా కమర్షియల్`తో ప్రేక్షకులను పలకరించాడు. ప్రముఖ దర్శకుడు మారుతి…
KTR: మోడీ (Modi)జీ.. భారత రూపాయి పతనవడానికి కారణం ఏమిటీ.. ? బీజేపీ (BJP)కి చెందిన ఉత్తరకుమారులు ఎవరి దగ్గరైనా ఈ…
Naresh’s third wife ramya attack: సీనియర్ నటుడు నరేష్(Naresh), పవిత్ర లోకేష్(Pavitra Lokesh) ల వ్యవహారం ఎలక్ట్రానిక్ ...…