Liger : లైగర్ ..డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ సినిమా. విజయ్ దేవరకొండ – అనన్య పాండే జంటగా నటిస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బాలీవుడ్ స్టార్ మేకర్ కరణ్ జోహార్ సమర్పణలో పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాధ్ – ఛార్మి కలిసి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా ముంబై లో ఇప్పటికే 40 శాతం టాకీపార్ట్ కంప్లీట్ అయింది. విజయ్ దెవరకొండ తో రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా లైగర్ ని తెరకెక్కిస్తున్నాడు పూరి జగన్నాధ్.
ఇక లైగర్ సినిమాని తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. విజయ్ దేవరకొండ ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా అయినప్పటికి దాదాపు 120 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతుండటం విశేషం. ఇస్మార్ట్ శంకర్ లాంటి మాస్ కమర్షియల్ హిట్ తర్వాత పూరి జగన్నధ్ నుంచి లైగర్ రాబోతుండటం తో అందరిలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో భారీ సక్సస్ అందుకొని విజయ్ దేవరకొండ పాన్ ఇండియన్ స్టార్ అనిపించుకోవాలని తాపత్రయపడుతున్నాడు. ఇక మార్క్ సినిమా కాబట్టి ఇండస్ట్రీ వర్గాలలో లైగర్ సినిమా గురించే భారీ ఎత్తున చర్చలు సాగుతున్నాయి.
Liger : విజయ్ దెవరకొండ లైగర్ షూటింగ్ ముంబై లోనే ..?
కాగా ముంబై లో షూటింగ్ ఆగిపోయిన తర్వాత మళ్ళీ పూరి జగన్నాధ్ లైగర్ షూటింగ్ ని మొదలు పెట్టలేదు. లాక్ డౌన్ తర్వాత అన్ని సినిమాల బ్యాలెన్స్ షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. కాని లైగర్ మాత్రం మొదలవకపోవడం ఫ్యాన్స్ రక రకాల కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు ఈ సినిమా హైదరాబాద్ లో మొదలవనుందని వార్తలు వస్తున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం లైగర్ షూటింగ్ ముంబై లోనే మొదలు పెట్టాలని పూరి జగన్నాధ్ డిసైడయ్యారట. హైదరాబాద్ లో సెట్ వేసి షూటింగ్ స్టార్ట్ చేద్దామనుకున్నప్పటికి కథా నేపథ్యం ముంబై కావడం తో పూరి మైండ్ సెట్ మారడం లేదని సమాచారం. ఇక ఈ సినిమా ఫిబ్రవరి నుంచి సెట్స్ మీదకి రాబోతుందని అంటున్నారు.