Lemon Lamp: నిమ్మకాయల దీపం పెట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలుమచ్చలు లేని వాడిపోని ఆకుపచ్చని రంగులో ఉన్న తాజా నిమ్మకాయలు వాడాలి.నెలసరి సమయంలో నిమ్మకాయ దీపాలు పెట్టకూడదు . స్త్రీలు నెలసరి ఐదు రోజులు పూర్తిగా గడిచిపోయిన తర్వాత మాత్రమే దీపాన్ని పెట్టాలి . పండగ సమయం ,పెద్దల తిథి ఉన్న రోజు నిమ్మకాయల దీపాలు పెట్టకూడదు .పిల్లల పుట్టిన రోజు ,పెళ్లి రోజు కూడా నిమ్మకాయల దీపాలు పెట్టకూడదు.
వేరే ఊరు లో ఉన్నప్పుడు , స్నేహితులు ,చుట్టాలు ఇంటికి వెళ్ళినప్పుడు వారి ఇంట్లో నిమ్మకాయల దీపాలు వెలిగించ కూడదు .అక్క లేదా ,చెల్లెళ్ళ ఇంటికి లేదా పుట్టింటికి వెళ్ళినప్పుడు ,లేదా ఆడపిల్ల ఇంటికి వెళ్లి నప్పుడు నిమ్మకాయ దీపాలు పెట్టకూడదు. ఆడవారు పట్టు చీర కట్టుకొని అమ్మవారికి నిమ్మకాయల దీపాలు పెడితే అమ్మ వారి అనుగ్రహం త్వరగా పొంది అన్ని పనులు ఎలాంటి అడ్డంకులు లేకుండా జరిగిపోతాయి .చీర రంగు ఎరుపు,పసుపు కలిగి ఉంటే మరి మంచిది.
మామూలు చీరలు కట్టుకొని నిమ్మకాయల దీపాలు పెడితే వారి వారి పనులు కూడా మధ్యమ స్థాయి లోనే జరుగుతాయి. ఎట్టి పరిస్థితిలో గంజి పెట్టిన బట్టలు వేసుకుని పూజ చేయకూడదు. మోడ్రన్ దుస్తులు వేసుకుని నిమ్మకాయ దీపాలు పెట్టిన కూడా ఫలితం ఉండదు.అలాగే దీపం క్రింద తమలపాకు,లేదా ఏదైనా ధాన్యపు గింజలు వేసి కుంకుమ బొట్టు పెట్టి దీపారాధన చేసుకోవచ్చు.నిమ్మకాయతో దీపం పెట్టిన తర్వాత దూపం కచ్చితంగా వేయాలి .ఎర్రని పూలతో పూజ చేసి .. బెల్లంతో చేసిన పరమాన్నం నైవేద్యంగా సమర్పించాలి .