Samantha: మహాభారత ఆదివార్వం ఆధారంగా ‘శాకుంతలం’ Shakuntalam సినిమాను దర్శక నిర్మాత గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న విషయం మనకు విదితమే. గుణశేఖర్ తాను దర్శకత్వం వహించే ప్రతి ఒక్క సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తాడు. గుణశేఖర్ కమర్షియల్ సినిమానే భారీ సెట్స్‌తో భారీ బడ్జెట్ తెరకెక్కిస్తే ఇక హిస్టారికల్ మూవీస్‌ను మరియు పౌరాణిక చిత్రాలను ఇంకా ఎంత శ్రద్ధతో తెరకెక్కిస్తాడో ప్రేక్షకులకు నిశితంగా అర్ధం అవ్వడంతో ఈ సినిమా మీద ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయని అర్ధం అవుతుంది.

ఈ సినిమా లో గుణశేఖర్ ప్రతి చిన్న విషయంలోనూ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ప్రేక్షకుల అంచనాలను మించి ఈ సినిమాను తెరకెక్కించాలని చూస్తున్నాడట. గతంలో ఆయన దర్శకత్వం వహించిన రుద్రమదేవి సినిమా దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సౌత్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని శాకుంతలం సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తుంది.
ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ అశోక్ ఈ సినిమా కోసం భారీ సెట్స్ ను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర సిబ్బంది ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులలో చాలా బిజీ గా ఉన్నారట. ఈ సినిమాలో శంకుతల పాత్ర కోసం గుణశేఖర్ ప్రత్యేకంగా నార చీరలను సిద్ధం చేయిస్తున్నారట. మహా భారత కాలంలో ఆడవారు నార చీరలు కట్టుకునేవారు. అందుకనే ఇప్పుడు శకుంతల పాత్ర చాలా సహజంగా కనిపించడానికి గుణశేఖర్ అలంటి చీరలను ప్రత్యేకంగా తయారు చేయిస్తున్నాడు.
మహాభారతంలోని ఆదిపర్వం లో గల దుష్యంతుడు మరియు శకుంతల ప్రేమకథను ఆధారంగా చేసుకుని గుణశేఖర్ ఈ శాంకుతలం సినిమాను తెరకెక్కించనున్నారు. అతి త్వరలో ఈ సినిమా కు సంబంధించిన షూటింగ్ స్టార్ట్ అవ్వనున్నది.
ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.