సూపర్ స్టార్ రజనీకాంత్ తెలియని వ్యక్తులు ఎవరూ ఉండరు. సినిమాల్లో ఆయన సింపుల్‌గా పంచ కట్టినా స్టైలే.. నడిచి వెళ్ళినా స్టైలే! అతను తన సినిమాల్లో బుల్లెట్‌ను కంటిచూపుతో ఆపుతాడు. వట్టిచేతులతో పాముని పట్టుకుంటాడు. ఆలోచింపజేసే డైలాగులు చెబుతాడు. ఎంతటి అందమైన అమ్మాయినైనా పడేస్తాడు. ఒక ఆధిపత్య పురుషుడు, ఆల్ఫా మేల్ గా వెండితెరను ఏలిన రజినీకాంత్ కొంతకాలం తర్వాత అట్టర్ ప్లాప్ సినిమాలతో సతమతమవుతున్నాడు. ఇందుకు కారణం గతంలో లాగా అదే మాస్ ఇమేజ్‌తో అతను సినిమాలు తీయకపోవడం అని చెప్పవచ్చు. 2014లో వచ్చిన లింగా సినిమా బాగానే ఉంటుంది. టీవీలో వస్తే ఇప్పటికీ ఈ సినిమాని ప్రేక్షకులు ఇష్టంగా చూస్తారు. కానీ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని రీతిలో ఫెయిల్ అయింది. దానికి అనేక కారణాలు చెప్పారు సినీ విమర్శకులు. అయితే తాజాగా స్వయానా డైరెక్టరే ఈ ఫ్లాప్ కి కారణాలు చెప్పారు.
దక్షిణాది సినీ డైరెక్టర్ కె.ఎస్ రవికుమార్ గురించి తెలియని వారు కూడా ఉండరు. రజనీకాంత్‌తో కలిసి అతను ముత్తు, నరసింహ వంటి హిట్ సినిమాలు తీశారు. ఆ తరువాత వీరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘లింగా’. కానీ మునుపటిలా ఈ సినిమా మాత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. రజనీకాంత్ సినీ చరిత్రలో లింగా సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. కానీ ఈ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు కేఎస్ రవికుమార్ మాట్లాడుతూ ‘లింగ’ సినిమా ఫ్లాప్ అవ్వటానికి గల కొన్ని కారణాలను చెప్పారు.
కె.ఎస్ రవికుమార్ ఓ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “లింగా సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోనే జరిగింది. ఆ సమయంలో రజనీకాంత్ మూవీ రఫ్ ఎడిటడ్ వెర్షన్ చూసి చాలా అసంతృప్తికి గురయ్యారు. ఆపై మాకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. అందులో భాగంగానే క్లైమాక్స్ లో బెలూన్ ఫైట్ ను పెట్టాల్సి వచ్చింది. అసలైతే మాకు ఆ ప్లాన్ లేదు కానీ రజినీకాంత్ గారు చెప్పడంతో ఏదో హడావుడిగా బెలూన్ ఫైట్ పెట్టాల్సి వచ్చింది. ఇది ఒక కారణమైతే మరో కారణం రజనీకాంత్ పుట్టినరోజున ఈ సినిమాని రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో త్వరగా షూటింగ్ చేశాం. దీనితో అవుట్ ఫుట్ సరిగ్గా రాకపోవడంతో లింగా సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయింద”ని కె.ఎస్ రవికుమార్ ఇంటర్వ్యూలో వివరించారు.
తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…
వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…
ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జగన్నాథ్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పూరి జగన్నాథ్.. ఆ తర్వాత…
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ త్వరలోనే `లైగర్` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్…
"లైగర్" సినిమా మరో వారం రోజుల్లో విడుదల కానుంది. ఇటువంటి తరుణంలో తాజాగా సెన్సార్ బోర్డ్ "లైగర్" ఊహించని షాక్ ఇచ్చింది. విషయంలోకి వెళ్తే సెన్సార్ బోర్డ్…