NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

BJP: “గ్రేటర్” బీజేపీని కుదిపేస్తున్న లింగోజిగూడ ఇష్యూ !సీరియస్ గా తీసుకున్న నాయకత్వం!!

BJP: ‘లింగోజిగూడ’ ఘటనపై బీజేపీ త్రీ మెన్ కమిటీ విచారణ కొనసాగుతోంది. ఈ డివిజన్ ఉప ఎన్నిక ఏకగ్రీవం కోసం అంటూ ఇటీవల కొందరు బీజేపీ నేతలు ప్రగతి భవన్​లో మంత్రి కేటీఆర్ ను కలవడం రాష్ట్ర బీజేపీలో కలకలం రేపింది. దీంతో పార్టీకి జరిగిన నష్టాన్ని నివారించేందుకు, నిజాలు నిగ్గు తేల్చేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం సోమవారం ముగ్గురు సభ్యులతో కమిటీ నియమించింది. కేటీఆర్ ను కలిసిన బీజేపీ నాయకుల్లో ఏడుగురు మంగళవారం పార్టీ స్టేట్ ఆఫీసులో త్రీ మెన్ కమిటీ ముందు హాజరై వివరణ ఇచ్చారు.

 Lingojiguda issue that is shrinking the "Greater" BJP!
Lingojiguda issue that is shrinking the Greater BJP

ఏకగ్రీవం కోసమే అలా చేశాం!

లింగోజిగూడ డివిజన్ కార్పొరేటర్ ఎన్నికను ఏకగ్రీవం చేయాలనే ఉద్దేశంతో మాత్రమే కేటీఆర్ ను కలిశామని, ఇది ఇంత రాద్ధాంతానికి దారితీస్తుందని ఊహించలేకపోయామని వారు కమిటీ ముందు చెప్పినట్లు తెలిసింది. ప్రగతి భవన్ కు వెళ్తున్న విషయం కారులో కూర్చునే వరకు తెలియదని, కేటీఆర్​ను కలవడం తప్పేనని వారు కమిటీ ముందు ఒప్పుకున్నట్లు సమాచారం. బుధవారం బీజేపీ మాజీ నేషనల్ కౌన్సిల్ మెంబర్ పేరాల శేఖర్ రావు, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు ల వివరణ తీసుకున్న అనంతరం త్రీ మెన్ కమిటీ రాష్ట్ర పార్టీకి రిపోర్టు ఇవ్వనుంది. అయితే రాష్ట్ర అధ్యక్షుడి పరిధిలో ఉన్న వారిపై బండి సంజయ్ చర్యలు తీసుకునే అవకాశం ఉందని, కొందరు సీనియర్ నేతల విషయంలో రాష్ట్ర కోర్ కమిటీ సమావేశంలో చర్చించి చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.

అగ్రనేతలకుతెలియకుండా వ్యవహారం నడిపారా?

లింగోజిగూడ డివిజన్ ఏకగ్రీవం కోసం బీజేపీ నేతలు కొందరు కేటీఆర్ ను కలవడానికి దారి తీసిన పరిస్థితులపై వాస్తవాలను తెలుసుకునేందుకు పార్టీ కమిటీని ఏర్పాటు చేసిందని బండి సంజయ్ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. లింగోజిగూడ డివిజన్ ఉప ఎన్నికలో బీజేపీ మరోసారి విజయం సాధించడం ఖాయమని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ పోటీ చేయడానికి మేము సిద్ధమైతే, రాష్ట్ర నాయకత్వం, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, పార్టీ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావుకు గాని సమాచారం ఇవ్వకుండా కొందరు నేతలు కేటీఆర్ ను కలవడాన్ని పార్టీ తీవ్రంగా పరిగణిస్తోందన్నారు.ఇది పార్టీ ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉందన్నారు. అందుకే ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ కోసం త్రీ మెన్ కమిటీని ఏర్పాటు చేసినట్లు సంజయ్ తెలిపారు.
ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో లింగోజిగూడ నుండి ఎన్నికైన బీజేపీ కార్పొరేటర్ మరణించడంతో అక్కడ ఉప ఎన్నిక జరగనుండగా కొందరు కమలనాథులు కేటీఆర్ ని కలిసి ఉప ఎన్నిక అవసరం లేకుండా ఏకగ్రీవానికి సహకరించాలని కోరడం, అందుకాయన అంగీకరించడం తెలిసిందే.ఈ సందర్భంగా కెటిఆర్ వారితో గ్రూప్ ఫొటో దిగడం,ఈ కారణంగా బీజేపీ అప్రతిష్ట పాలు కావడం జరిగింది.దీన్ని పార్టీ అధిష్టానవర్గం సీరియస్ గా తీసుకుంది.ఏదేమైనా ఈ వ్యవహారం బీజేపీలో హాట్ టాపిక్ గా మారింది.

author avatar
Yandamuri

Related posts

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju

Teachers Recruitment Scam: బెంగాల్ హైకోర్టు సంచలన తీర్పు .. 25వేల మంది ఉపాధ్యాయులకు బిగ్ షాక్ .. సీఎం మమతా బెనర్జీ ఏమన్నారంటే ..?

sharma somaraju

MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ ముగిసిన వాదనలు .. తీర్పు ఎప్పుడంటే..?

sharma somaraju

AP Elections 2024: మరో 38 మంది అభ్యర్ధులను ప్రకటించిన కాంగ్రెస్

sharma somaraju

Rashmika Mandanna: సాయి పల్లవి దయతో స్టార్ హీరోయిన్ అయిన రష్మిక.. నేషనల్ క్రష్ కు న్యాచురల్ బ్యూటీ చేసిన సాయం ఏంటి?

kavya N

Raj Tarun: పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన రాజ్ త‌రుణ్‌.. జీవితాంతం ఇక అంతేనా గురూ..?

kavya N