పాయల్ రాజ్ పుత్…ఆర్ ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన హాట్ బ్యూటి. ఈ సినిమాలో పాయల్ పర్ఫార్మెన్స్ కి యూత్ తెగ అట్రాక్ట్ అయ్యారు. మత్తు కళ్ళతో సిల్వర్ స్క్రీన్ మీద చెలరేగిన పాయల్ మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది. అయితే ఆ తర్వాత మళ్ళీ సోలో హీరోయిన్ గా చెప్పుకోదగ్గ హిట్ అందుకోవడంలో ఫేయిల్ అయింది. ఆర్ ఎక్స్ 100 తర్వాత కూడా వచ్చిన సినిమాలన్ని ఆ తరహా కథలు కావడంతో కొన్ని వదులుకోగా తప్పని పరిస్థితుల్లో చేసిన ఆర్ డి ఎక్స్ లవ్ మాత్రం దారుణంగా పాయల్ ని దెబ్బ తీసింది.
దాంతో పాయల్ కెరీర్ చిక్కుల్లో పడింది. కాని రవితేజ తో చేసిన డిస్కో రాజ… వెంకటేష్ తో చేసిన వెంకీమామా వెతుక్కుంటూ పాయల్ కి వచ్చిన అవకాశాలు. అయితే ఈ రెండింట్లో రవితేజ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. వెంకీ మామా హిట్ అయినా పాయల్ కి ఉపయోగపడలేదు. అయినా ఏదో రకంగా మంచి హిట్ దక్కించుకోవాలన్న ఉద్దేశ్యంతో ప్రయత్నాలు చేస్తూనే ఉంది.
మరోసారి రవితేజ సరసన చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. అయితే పాయల్ లిప్ లాక్ కి యూత్ లో మంచి క్రేజ్ ఉంది. కాని ఆ లిప్ లాక్ విషయంలో మాత్రం పాయల్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని తాజాగా వెల్లడించింది. పాయల్ ఏ సినిమాలోనైనా లిప్ లాక్ ఇవ్వాలంటే ముందు అమ్మ పర్మిషన్ కావాలట. పాయల్ వాళ్ళ అమ్మ ఒప్పుకుంటే సినిమాలో లిప్ లాక్ కమిటవుతాను ..లేదంటే లేదు అంటూ షాకింగ్ విషయం బయట పెట్టింది పాయల్. వినడానికి కాస్త విడ్డూరంగా ఉన్నా తను చెప్పేదే కదా నమ్మాల్సింది.