ప్రస్తుతం ఎలక్ట్రానిక్ మీడియా కంటే సోషల్ మీడియా జనాలను చాలా ప్రభావితం చేస్తున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియా ద్వారా ప్రపంచంలో ఏ మూల ఏది జరిగిన క్షణాలలో అరచేతుల్లో చూసే పరిస్థితి నెలకొంది. ఇక ఇదే సమయంలో సెలబ్రిటీలు సైతం సోషల్ మీడియా ద్వారా తమ అభిమానులకు అందుబాటులో ఉంటూ ఉన్నారు. తమపై బయట వచ్చే గాసిప్స్ ఇంకా తమ కెరీర్ కి సంబంధించిన అనేక విషయాలు సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తూ ఉన్నారు. చేయబోయే సినిమా ఇంకా తమపై బయట జరిగిన నెగిటివ్ ప్రచారానికి సంబంధించి క్లారిటీ లు ఇస్తున్నారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం సౌత్ ఫిలిం ఇండస్ట్రీ ఆవ దేశవ్యాప్తంగా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో అత్యధికంగా ఫాలోవర్స్ కలిగిన హీరోల లిస్ట్ తాజాగా బయటపడింది. ఈ క్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియాలో అత్యధికంగా ఫాలోవర్స్ కలిగిన హీరోగా మొదటి స్థానంలో ఉన్నారు. 46.8 మిలియన్స్ ఫాలోవర్స్ బన్నీకి ఉండటం జరిగింది. ఆ తర్వాత మహేష్ 36.7 మిలియన్స్, ప్రభాస్ 34.2 మిలియన్స్, విజయ్ దేవరకొండ 30.1 మిలియన్స్, రామ్ చరణ్ తేజ్ 22.09 మిలియన్స్, ధనుష్ 22.06 మిలియన్స్, యాష్ 20.09 మిలియన్స్, సూర్య 20 మిలియన్స్, ఎన్టీఆర్ 17.04 మిలియన్స్, విజయ్ 11.08 మిలియన్స్.. కలిగిన ఫాలోవర్స్ ఈ హీరోలకు సోషల్ మీడియా ఎకౌంట్ లలో ఉండటం జరిగింది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా దక్షిణాది సినిమాల హవా నడుస్తోంది. బాలీవుడ్ సినిమాలు సైతం సౌత్ హీరోల సినిమాలు ముందు తేలిపోతున్నాయి. ఏమాత్రం పోటీ ఇవ్వలేని పరిస్థితిలోకి బాలీవుడ్ వెళ్ళిపోయింది. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ హీరోలు సైతం సౌత్ ఫిలిం ఇండస్ట్రీకి చెందిన వాళ్లతో సినిమాలు చేసే పరిస్థితి ప్రస్తుతం నెలకొంది.