NewsOrbit
న్యూస్ ప్ర‌పంచం

Liz Truss: బ్రిటన్ ప్రధాని పదవికి లిజ్ ట్రస్ రాజీనామా

Liz Truss: బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రధాని పదవి చేపట్టిన 45 రోజుల్లోనే ఆమె ఆ పదవి నుండి తప్పుకోవడం గమనార్హం. ప్రధాని రాజీనామాతో బ్రిటన్ లో మరో మారు రాజకీయ సంక్షోభం నెలకొంది. లిజ్ ట్రస్ ఇటీవల ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. దేశంలో అంతకంతకూ పెరుగుతున్న ఆర్ధిక సంక్షోభాన్ని అదుపు చేయలేక ప్రధాని బోరిస్ జాన్సన్ తన పదవికి రాజీనామా చేసిన తర్వాత 45 రోజుల క్రితం లిజ్ ట్రస్ ప్రధానిగా ఎన్నికైన సంగతి తెలిసిందే. భారత సంతతికి చెందిన రుషి సునక్ తో పోటీ పడి ఆమె విజయం సాధించారు.

liz truss resigns as Uk prime minister

మినీ బడ్జెట్ పై విమర్శలు రావడంతో అందుకు దేశ ప్రజలకు లిజ్ ట్రస్ క్షమాపణలు తెలియజేస్తూ ప్రకటన విడుదల చేశారు. దేశంలో ఆర్ధిక సంక్షోభం తీవ్రతరం కావడంతో ట్రస్ కేబినెట్ లోని పలువురు మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో విధిలేని పరిస్థితిలో లిజ్ ట్రస్ తన పదవికి రాజీనామా చేశారు. ఆమె కేవలం 44 రోజులే ప్రధాని పదవిలో కొనసాగారు. సెప్టెంబర్ 6న ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు లిజ్ ట్రస్. తన రాజీనామా విషయాన్ని బ్రిటన్ రాజుకు తెలియపర్చాననీ, తదుపరి ప్రధానిని ఎన్నుకునే వరకు పదవిలో కొనసాగనున్నట్లు మీడియాకు తెలిపారు లిజ్ ట్రస్.

తీవ్ర ఆర్ధిక, అంతర్జాతీయ అస్తిరత కొనసాగుతున్న తరుణంలో తాను ప్రధాని పదవి చేపట్టానని పేర్కొన్న లిజ్ ట్రస్.. ఉక్రెయిన్ పై రష్యా యుద్దం కొనసాగిస్తుండటం యూరప్ తో పాటు బ్రిటన్ కు ముప్పుగా పరిణమించిందని, ఈ పరిస్థితి దేశ ఆర్ధిక పరిస్థితిని మరింత క్షీణింపజేసిందని తెలిపారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju