Bigg Boss 5: సీక్రెట్ రూమ్‌లో ఉన్న లోబోకి ప్రియ ఆంటీ కరెక్ట్ పాయింట్లో దొరికింది.. !

Share

Bigg Boss 5: బిగ్‌బాస్ సీజన్ 5 ప్రారంభమై నెల రోజులు దాటిపోయింది. ఇప్పటికే సరయు, ఉమాదేవి, లహరి, హమీదా హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం శ్వేత ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా శనివారం జరిగిన ఎపిసోడ్ లో హోస్టు నాగార్జున డబల్ ఎలిమినేషన్, సర్ ప్రైజ్ ఎలిమినేషన్, సీక్రెట్ రూమ్ అంటూ వరుస ట్విస్టులతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ప్రయత్నించారు. అంతేకాదు లోబోను ఇంటికి పంపిస్తున్నట్టు నాటకమాడి చివర్లో అతన్ని సీక్రెట్ రూమ్‌కు పంపించారు. ఈ క్రమంలో ప్రియ లోబోపై చేసిన కొన్ని వ్యాఖ్యలు హౌజ్ లోనే కాదు బిగ్‌బాస్ అభిమానుల్లోనూ సంచలనం సృష్టిస్తున్నాయి.

లోబోపై ప్రియ కామెంట్స్

39 ఏళ్ల మహమ్మద్ ఖయ్యం అలియాస్ లోబో కమెడియన్ అలీకి బంధువు అవుతాడు. హైదరాబాద్ లో ఒక టాటూ పార్లర్, బట్టల షాపు కూడా నడుపుతున్నాడు. కొద్దో గొప్పో పాపులారిటీ పెంచుకుందామని అతడు బిగ్‌బాస్ లోకి అడుగు పెట్టాడు. మొదట్లో బాగానే యాక్టివ్‌‌గా ఉంటూ అందరినీ అలరించిన లోబో ఆ తర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోయాడు. తిన్నామా.. పడుకున్నామా.. తెల్లారిందా అనే ధోరణిలో అతని గేమ్ కొనసాగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

గత కొద్ది రోజుల క్రితం అతడు ప్రియపై తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. తన ప్రేమ గురించి చులకనగా మాట్లాడిందని ప్రియపై అతడు నోరు పారేసుకున్నాడు. దీంతో చాలామంది అతడికి చివాట్లు పెట్టారు. ఆ ఒక్క ఘటనతో ప్రియ లోబోపై బాగా కోపం పెంచేసుకుంది. ఏదో కొట్టాలన్నంత కసితో గుర్రుగా చూడటం వంటి విపరీత చేష్టలు లోబో చేశాడని ప్రియ ఒకానొక సందర్భంలో ఆందోళన కూడా వ్యక్తం చేసింది. ఈ క్రమంలో అతడిని ఎలిమినేట్ చేసినట్టు హౌస్ లో నుంచి బయటకు పంపించడంతో.. అందరికంటే ప్రియనే ఎక్కువగా ఊపిరిపీల్చుకున్నట్టు తెలుస్తోంది. సీక్రెట్ రూమ్ లో లోబో ఉన్నాడని తెలియక అతడిపై షాకింగ్ వ్యాఖ్యలు కూడా చేస్తోంది. తాజాగా తోటి కంటెస్టెంట్లతో మాట్లాడుతూ.. లోబో వెళ్లిపోవడమే మంచిది అన్నట్టు ఆమె కామెంట్లు చేసింది. దీంతో అతడికి ప్రియ కరెక్ట్ పాయింట్లో దొరికినట్లయింది. సోమవారం ప్రసారమయ్యే ఎపిసోడ్ లో లోబోపై ప్రియ చేసిన కామెంట్స్ చూడొచ్చు.

లోబో ఎలా స్పందించనున్నాడు

హోస్ట్ నాగార్జున లోబోని ఇప్పటికే చాలాసార్లు మందలించారు. దాంతో హౌజ్ లో ఏం మాట్లాడాలో, ఏం చేయాలో కూడా తెలియక అతడు సతమతమవుతున్నాడు. నిశ్శబ్దమే తన అజ్ఞానాన్ని, తప్పులను కప్పిపుచ్చుతుందని భావిస్తున్నాడు కానీ తనకి తెలియకుండానే కొన్ని పొరపాట్లు చేస్తూ అందరికీ టార్గెట్ అవుతున్నాడు. ఇలాంటి పరిస్థితులలో అతడు ప్రియపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఆమెను ఎదుర్కొంటాడా అనేది సందేహమే. గత సీజన్ లో అఖిల్ అభిజిత్ తో ఒక కామెంట్ గురించి రచ్చ సృష్టించి తనకు తానే నష్టపోయాడు. ఆ తరహాలోనే లోబో కంట్రోల్ తప్పి అర్జున్ రెడ్డి మాదిరి ప్రవర్తిస్తాడో లేక ఏం చేస్తాడో అనేది తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.


Share

Related posts

ఈ చిట్కాలు పాటిస్తే తీరైన కను బొమ్మలు మీ సొంతం!!

Kumar

టీటీడీ ఇఓ సింఘాల్ బదిలీ

Special Bureau

‘జలవివాదం’ ముగించేందుకు కేసీఆర్ రెడీ అయిపోయాడు..! మరి జగన్?

siddhu