Bigg boss fame lobo: నిన్న మొన్నటి వరకు లోబో అంటే ఏ కొద్దిపాటి మందికి మాత్రమే తెలుసు. కానీ బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టాక లోబో అందరివాడయ్యాడు. సహజంగా లోబో అంటే పొడవాటి పిల్లి గెడ్డం, మల్టి కలర్డ్ కాస్ట్యూమ్స్, ఒంటి నిండా టాటూస్ మనకి గుర్తొస్తాయి. అవును. మామ్మూలుగా వృత్తి రీత్యా లోబో టాటూస్ వేస్తూ ఉంటాడు. కృష్ణా నగర్ విధుల్లో తిరిగే ప్రతీ అబ్బాయికి లోబో బాగా సుపరిచితుడే. ఇప్పటి యూత్ తమకిష్టమైన టాటూస్ కోసం మన లోబో దగ్గరికే వెళ్తూ వుంటారు.
ఎవరి సినిమాలో ఇతనికి వేషం దొరికింది?
తెలుగు సినిమాకే ఆయన నిలువెత్తు ఆదర్శం. అతగాడే మన మెగాస్టార్. టాలీవుడ్ లోకి కొత్తగా అడుగుపెట్టిన దర్శకులు, హీరోయిన్స్ ఇంకా ఇతరత్రా నటీనటులు అనేక మంది చిరంజీవి సినిమాలో ఛాన్సులు కోసం పడిగాపులు కాస్తూ వుంటారు. ఎంతో అదృష్టం, కృషి ఉంటే తప్ప, అతని సరసన నటించే అవకాశం ఏ కొద్ది మందికో దొరుకుతుంది. అలాంటిది లోబోకి చాలా ఈజీగా ఆ చాన్సు దొరికేసింది అని టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
మరి లోబోకి ఆ ఛాన్స్ ఎలా వచ్చింది?
ఏది ఎలా ఉన్నా, లోబో మాత్రం తెగ పొంగిపోతున్నాడు. తన అభిమాన, ఆరాధ్య నటుడు అయినటువంటి మెగాస్టార్ తో అవకాశం వచ్చినందుకు తన ఇష్టదైవాలను మొక్కేస్తున్నాడు. దీని వెనక అంతగా కృషి లేకపోయినా కేవలం అదృష్టం ఉండటం వలనే ఈ అవకాశం లోబోకి వచ్చిందని, తన సహచరులు అంటున్నారు. అయితే కొందరు మాత్రం, లోబోకి వున్న ప్రత్యేక స్టైల్ తనకి ఈ అవకాశం తెచ్చి పెట్టిందని అంటున్నారు. తన హెయిర్ స్టైల్, కాస్త్యుమ్స్, గెడ్డం మరియు బాడీ లాంగ్వేజ్ వంటి ప్రత్యేకమైన స్టైల్ చిరంజీవిని ఆకర్షించాయని అందరూ అంటున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో రాబోతున్న ‘భోళా శంకర్’ సినిమాలో తనకి ఈ అవకాశం వచ్చిందనే విషయాన్ని అతగాడు తాజాగా వెల్లడించాడు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?