Bigg Boss 5 Telugu: యాంకర్ రవి గెలుపు కోసం కష్టపడుతున్న ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్..!!

Share

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) హౌస్ లో టాప్ మోస్ట్ కంటెస్టెంట్ గా యాంకర్ రవి పేరు ముందు నుంచి వినిపిస్తున్న సంగతి తెలిసిందే. రవి యాంకరింగ్ ఫీల్డ్ లో టెలివిజన్ రంగంలో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు. దీంతో మనోడు బిగ్ బాస్(Bigg Boss) హౌస్ లో అడుగు పెట్టడంతో.. ఖచ్చితంగా టైటిల్ గెలవకపోయినా టాప్ ఫైవ్ లో బెర్త్ కన్ఫామ్ అనే టాక్ ప్రారంభం నుండి ఉంది. ఇదిలా ఉంటే రవి హౌస్ లో అడుగు పెట్టాక … తన గేమ్ కంటే పక్క వాళ్ళ గేమ్ పై ఎక్కువ శ్రద్ధ పెట్టి వారిని ఇన్ ఫ్లున్స్ చేయడం జరిగింది. ఈ క్రమంలో కొందరు ఈ మధ్య గొడవ పెట్టి రవి అడ్డంగా బుక్ అయినా సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రియ ఆంటీ(Priya Aunty) – లహరి(Lahari)  మధ్య అతి పెద్ద గొడవ జరగడానికి.. ప్రధాన కారణం రవి అని అప్పట్లో ఫుటేజ్ కూడా బయటకు వచ్చింది.

Every day is a challenge: Anchor Ravi

ఇక ఇదే తరహాలో చాలాసార్లు దొరికిపోయి అమ్మపై ఒట్టు పెడుతూ ఏకంగా నాగార్జున ముందు కూడా అబద్ధాలు ఆడుతూ ఉండటంతో రవి పాపులారిటీ గతంలో కంటే బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టాక క్రమక్రమంగా తగ్గుతోంది అనే టాక్ ప్రస్తుతం బయట వినపడుతోంది. ఇక ఇదే తరుణంలో నటరాజ్ మాస్టర్ పెట్టిన గుంటనక్క టైటిల్ కి తగ్గట్టుగానే రవి గేమ్ ఆడుతూ ఉండటంతో.. ప్రారంభంలో రవికి పడిన ఓటింగ్ కంటే ప్రస్తుతం ఓటింగ్ శాతం తగ్గుతున్నట్లు టాక్ నడుస్తోంది. ఇటువంటి తరుణంలో ఎనిమిదవ వారం లో ఇంటి నుండి ఎలిమినేట్ అయిన లోబో(Lobo) ప్రస్తుతం రవికి భారీగా సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. రవి తన అన్నయ్య.. మంచి ఫ్రెండ్, బిగ్ బాస్ హౌస్ లో మాస్ మహారాజా ఎంటర్టైనర్.. అంటూ లోబో.. వీడియో లు పెడుతూ రవికి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలని.. మద్దతు ఇస్తున్నాడు. రవి(Ravi), లోబో(Lobo) ఇద్దరూ కూడా టెలివిజన్ రంగం నుండి మంచి ఫ్రెండ్స్. అదేరీతిలో రవి కూడా లోబో కి… మంచి కెమెరా స్పేస్ వచ్చే రీతిలో ఎంటర్టైన్మెంట్ చేయడం జరిగింది. ఈ తరుణంలో అనూహ్యంగా 8వ వారం లోబో ఎలిమినేట్ కావడం జరిగింది.

Bigg Boss telugu 5: నీ యాటిట్యూడ్ నీ దగ్గర పెట్టుకో.. యాంకర్ రవికి లోబో  వార్నింగ్.. చిన్నోడా తొక్కేస్తారంటూ.. | Bigg Boss Telugu 5 Promo: Lobo  disagreement with Anchor Ravi ...
ఇంటి నుండి ఎలిమినేట్

అయితే ప్రస్తుతం బయటకు వచ్చినా లోబో ఒకపక్క కొత్త షోలలో పాల్గొంటూ… మరొక పక్క రవి(Ravi)కి భారీ ఎత్తున సపోర్ట్ చేస్తూ వస్తున్నాడు. దాదాపు పది వారాలలో ఎనిమిది వారాల పాటు రవి.. ఎలిమినేషన్ కి నామినేట్ కావడం జరిగింది. పరిస్థితి ఇలా ఉంటే..ఈ వారం నామినేషన్ లో ఉన్న రవికి భారీగానే ఓట్లు పడుతూ ఉన్నాయి. గతంలో పోలిస్తే తక్కువ అయినా గాని ఈ వారం నామినేషన్ లో రవి తో పాటు.. మానస్(Manas), సన్నీ(Sunny), సిరి(Siri), కాజల్(Kajal) ఉన్నారు. వీరిలో సన్నీకి భారీ ఎత్తున ఓట్లు పడుతున్నాయి. అదే రీతిలో సిరి కి కూడా పడుతున్నాయి. అయితే చాలా వరకు ఇంటి నుండి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఓటింగ్ పరంగా చూసుకుంటే ప్రస్తుతం కాజల్(Kajal), మానస్ (Manas) మధ్య టాగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. చాలా వరకు ఇంటి నుండి బయటకు వెళ్లిపోయారు ఛాన్స్ కాజల్ కి ఉన్నట్లు బయట భారీ ఎత్తున ప్రచారం జరుగుతోంది. మానస్ కొద్దో గొప్పో మైండ్ గేమ్ ఆడుతున్న… కాజల్ ఆడుతున్న గేమ్ కన్నింగ్ అన్న తరహాలో చాలా సందర్భాలలో రుజువు అవుతోంది. ఈవారం ఎలిమినేషన్ ఎలిమినేషన్ ప్రక్రియలో సన్నీ టీం లో ఉన్నా గాని.. తన స్వార్థం కోసం ఆడటంతో చివరాకరికి ఆమె తీసిన గోతిలో ఆమె పడి.. నామినేషన్ లిస్ట్ లో ఉంది. దీంతో చాలా వరకు కాజల్ ఇంటి నుండి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయని.. బయట జనాలు అంటున్నారు.


Share

Related posts

Corona Vaccine: కోవిషీల్డ్ టీకా ధర తగ్గించిన సీరం ఇన్సిట్యూట్

somaraju sharma

టీవీఎస్ ఎక్సెఎల్ సరికొత్త ఎడిషన్ లాంచ్.. ఫీచర్స్ చూసేయండి..

bharani jella

వైసీపీ కండువా కప్పుకున్న టీడీపీ నేత రామసుబ్బారెడ్డి

Siva Prasad