Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో.. బాగా ఎంటర్టైన్ చేస్తున్నా కంటెస్టెంట్ ల లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు లోబో. ఎవరి ట్రాప్ లో పడకుండా.. తనదైన శైలిలో హౌస్ లో.. నవ్వులు పూయిస్తున్న డు. ఇదే విషయాన్ని మొదటి వీకెండ్ ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున తెలపడం జరిగింది. ఇదిలా ఉంటే ఎంత పర్సనాలిటీ కలిగిన లోబో.. హౌస్ లో మొదటి నుండి కింద పడుకుంటున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో మరో హెవీ పర్సనాలిటీ సీనియర్ నటి ఉమాదేవి కూడా కిందనే పడుకుంటున్నారు.
ఒక్కోసారి సోఫాపై పడుకుంటున్నారు. ఇటువంటి తరుణంలో వీరిద్దరికీ బిగ్బాస్ సింగల్ బెడ్ దక్కించుకునేందుకు.. టాస్క్ ఇవ్వటం జరిగింది. వీళ్ళిద్దరిలో ఇంటి సభ్యులను ఎక్కువగా ఎవరు నవ్విస్తే వాళ్ళకి బెడ్ సొంతమని చెప్పటంతో..లోబో.. తనదైన శైలిలో రెచ్చిపోయాడు. పింకీ తో కలిసి స్కిట్ చేసి.. అందర్నీ అలరించడం జరిగింది. ఆ తర్వాత ట సీనియర్ నటి ఉమాదేవి అత్తా కోడలు స్కిట్ .. చేయడం జరిగింది. లోబో స్కిట్ తో పోలిస్తే ఉమాదేవి స్కిట్ లో… పెద్దగా విషయం లేదు అన్నట్టు అనిపించింది. మరోపక్క ఇదే సమయంలో తన స్కిట్ లో ఉమాదేవి లోబోను బర్రె, జెస్సీని ఆవుతో పోల్చడం.. జరిగింది.
ఈ క్రమంలో ఈ కామెడీ స్కిట్ లలో లోబో ఎక్కువ ఓట్లు గెలుచుకుని విజేతగా నిలిచాడు. దీంతో ఆ ఆనందం తట్టుకోలేక ఏకంగా స్విమ్మింగ్ పూల్ లోకి దూకేయడం జరిగింది. అనంతరం ఎమోషనల్ అయ్యి కన్నీళ్లతో.. తనకు సపోర్ట్ చేసిన ఇంటి సభ్యులకు కృతజ్ఞతలు తెలిపాడు. ఆ తర్వాత.. తాను ఏదైనా తప్పుచేస్తే క్షమించు అని తాను గెలిచిన బెడ్.. ఇంటిలో పెద్దవారు అన్న తరహాలో ఉమాదేవికి లోబో త్యాగం చేయడం జరిగింది.