Local boi Nani : లోకల్ బాయ్ నాని గురించి తెలుసు కదా. ప్రస్తుతం యూట్యూబ్ లో మనోడే ట్రెండింగ్ టాపిక్. సముద్రంలో చేపల వేటకు ఎలా వెళ్తారు? చేపలను ఎలా పడతారు? సముద్రంలో మూడునాలుగు రోజులు ఉండాలంటే ఎలా? చేపలు పడకపోతే ఏం చేస్తారు? ఇలా… సముద్రంలో వేటకు వెళ్లేటప్పుడు చేసే అన్ని పనుల గురించి వీడియోలు తీసి మరీ… యూట్యూబ్ లో పెడుతున్నాడు లోకల్ బాయ్ నాని.

లోకల్ బాయ్ నాని పేరుతోనే యూట్యూబ్ చానెల్ ఓపెన్ చేసి అతి తక్కువ సమయంలోనే పేరు సంపాదించుకున్నాడు లోకల్ బాయ్ నాని. టిక్ టాక్ ఉన్న సమయంలో… టిక్ టాక్ లో మంచి మంచి వీడియోలు చేసి టిక్ టాక్ స్టార్ అయిన నాని… టిక్ టాక్ బంద్ అయ్యాక… యూట్యూబ్ చానెల్ పెట్టాడు.
Local boi Nani : ఎవరో కామెంట్ పెట్టారని నడి సముద్రంలో దూకేసిన నాని
తన ముందు వీడియోలో ఎవరో ఒక నెటిజన్… నడి సముద్రంలో దూకి ఈత కొట్టాలంటూ నానిని కోరాడట. దీంతో చేపల వేటకు వెళ్లినప్పుడు నడిసముద్రంలో నాని దూకేసి.. ఈత కొట్టాడు. కేవలం ఒక్క తాడు సాయంతోనే నడి సముద్రంలో దూకేశాడు.
నిజానికి నడి సముద్రంలోకి వెళ్లాక దూకడం అనేది సాహసమే అని చెప్పాలి. ఎందుకంటే.. నడి సముద్రంలో పెద్ద పెద్ద చేపలు, తిమింగళాలు, షార్క్ లు కూడా ఉంటాయి. వాటి కంట పడ్డామంటే ఖతం.. అవి మనిషి కనిపిస్తే వదలవు. అంత డేంజర్ ఉన్నప్పటికీ.. తన సబ్ స్క్రైబర్ కోసం నడి సముద్రంలో దూకి కాసేపు ఈత కొట్టాడు నాని.
ఎంతైనా నాని చేసిన సాహసాన్ని మెచ్చుకోవాల్సిందే. నెటిజన్లు కూడా నాని చేసిన సాహసాన్ని చూసి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.
ఇంకెందుకు ఆలస్యం.. దానికి సంబంధించిన వీడియోను మీరు కూడా చూసేయండి మరి.