NewsOrbit
న్యూస్

శత్రుదేశాల అంతుతేల్చనున్న.. మరో బ్రహ్మాస్త్రం..!

 

జలాంతర్గ మార్గాల ద్వారా శత్రువులు మన దేశ సంపదను కొల్లగొడతున్నారు..! నరేంద్ర మోడీ భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి దేశంలో త్రివిధ దళాల బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించిన సంగతి తెలిసిందే…!ఇప్పుడు శత్రువుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తించేలా మరో బ్రహ్మాస్త్రం తీసుకొస్తున్నారు..?భారతదేశంలో నావీ డే సందర్భంగా లాక్‌హీడ్ మార్టిన్ సంస్థ భారతదేశం కోసం తయారు చేస్తున్న ఎంహెచ్ -60 రోమియో మల్టీరోల్ హెలికాప్టర్‌ మొట్టమొదటి ఫొటోలను విడుదల చేసింది..! పూర్తి వివరాలు ఇలా..

భారతీయ జలాల భద్రత నిఘాలో ఎంహెచ్-60 రోమియో మల్టీరోల్ హెలికాప్టర్లు ముఖ్యమైన పాత్రను పోషించనున్నాయి. ఈ హెలికాప్టర్లు నీటి లోపల, బయట ఉండే శత్రువులను గుర్తింస్తుంది. అంతేకాకండా వారితో పోరాడేందుకు అవసరమైన అనేక ఆధునిక పరికరాలు, ఆయుధాలను కలిగి ఉంది. ఇవి నీటి ఉపరితలం పైన, నీటి అడుగున ఉండే లక్ష్యాలను సైతం ఛేదించగలవు. ఇందులో హెల్ఫైర్ క్షిపణులు, ఎంకే-54 టార్పెడోలు ఉంటాయి.. శత్రువుల జలాంతర్గాములు, ఓడలను నాశనం చేయగల శక్తిసామర్థ్యాలు దీనికి సమకూర్చారు. ఇంకా సముద్ర జలాల్లో రెస్క్యూ ఆపరేషన్లను నిర్వహించేలా తయారుచేశారు. లాక్‌హీడ్ మార్టిన్ నిర్మించిన ఈ హెలికాఫ్టర్లు, ప్రస్తుతం భారత నావీ ఉపయోగిస్తున్న బ్రిటీషర్లు నిర్మించిన సీ కింగ్ హెలికాఫ్టర్ల స్థానాన్ని భర్తీ చేయనున్నాయి. ఈ సంస్థ నుండి మొత్తం 24 హెలికాఫ్టర్లు భారత్‌కు చేరనున్నాయి.

ప్రత్యేకతలు :
ఈ హెలికాఫ్టర్లలో అధునాతన రాడార్ వ్యవస్థలు, మెషిన్ గన్‌లు, ఆధునిక రెస్క్యూ పరికరాలు, సెన్సార్లు ఉన్నాయి. ఇవి క్షిపణి, శత్రువులు చేసే దాడిని ముందుగానే గుర్తించి సమాచారాన్ని చేరవేస్తుంది.. ఇందులో అధునాతన సోనార్ వ్యవస్థను ఏర్పాటు చేశారు, ఇది సముద్రం లోతులో దాగి ఉన్న జలాంతర్గాములను సైతం గుర్తించగలదు. ఈ హెలికాప్టర్ గంటకు గరిష్టంగా 267 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఇంధన ట్యాంక్ నిండినప్పుడు, ఈ హెలికాప్టర్ 10,659 కిలోల బరువుతో 834 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. చైనా, పాకిస్తాన్‌లతో సముద్ర సరిహద్దును పర్యవేక్షించడానికి ఈ హెలికాప్టర్లను మోహరించనున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనలో భాగంగా, ఇరు దేశాల మధ్య రక్షణ సహకారం సురక్షితం చేశారు. ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం, అమెరికా – భారతదేశానికి అపాచీ, ఎంహెచ్-60 రోమియో హెలికాప్టర్లు తో సహా 3 బిలియన్ డాలర్ల ఆధునిక సైనిక పరికరాలు రానున్నట్లు తెలుస్తోంది.

author avatar
bharani jella

Related posts

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju