సిమ్లాలో ఉత్సాహంగా లోహ్రీ వేడుకలు

సిమ్లా, జనవరి 14:ఉత్తరాదిన లోహ్రీ సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

చిన్నా పెద్దా భోగిమంటల దగ్గర సందడి చేస్తున్నారు.

హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ సిమ్లాలోని తన అధికారిక నివాసంలో జరిగిన లోహ్రీ సంబరాల్లో పాల్గొన్నారు.

భోగిమంటల చుట్టూ అందరితో కలిసి ఉత్సాహంగా స్టెప్పులేశారు.

అయితే తెలుగువాళ్లు ఇవాళ ఉదయం భోగి మంటలు వేసుకుంటే.. ఉత్తరాదిన నిన్న రాత్రే వేసుకున్నారు. ఉత్తరాది ప్రజలు సంక్రాంతిని మాఘీ పేరుతో జరుపుకుంటారు. మాఘీకి ముందు రోజు లోహ్రీ సెలెబ్రేట్ చేసుకుంటారు.

దక్షిణాదిన జరుపుకునే భోగి పండుగను నార్త్‌లో లోహ్రీగా పిలుస్తారు.

ఇంటి ముందు భోగి మంటలు వేసుకుని.. సంప్రదాయ నృత్యాలు చేస్తారు. నవధాన్యాలు, నెయ్యి ఇతర దినుసులతో కట్టెలను మండిస్తారు.

అయితే దక్షిణాదిలో భోగి మంటలు ఉదయం వేస్తే.. నార్త్‌లో సాయంత్రం వేస్తారు.

లోహ్రీ వేడుకల్లో హిమాచల్ ముఖ్యమంత్రి పాల్గొన్న వీడియో కింద చూడండి