NewsOrbit
జాతీయం న్యూస్

Lok Sabha Elections: అస్సాంలోని ఈ పెద్ద కుటుంబంలో 350 మంది ఓటర్లు ..ఆ కుటుంబ ఓట్ల కోసం అభ్యర్ధుల ప్రయత్నాలు

Lok Sabha Elections: దేశంలో సార్వత్రిక ఎన్నికల సమయం ఆరంభం అయ్యింది. మరో నాలుగు రోజుల్లో తొలి దశ పోలింగ్ జరగనుంది. ఎన్నికల ప్రచారం చేస్తున్న వివిధ పార్టీల అభ్యర్ధులు, నేతలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఈ క్రమంలోనే గంపగుత్తగా ఓట్లను పడేసుకునేలా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.

తాజాగా ఓ కుటుంబంలోని ఓట్ల కోసం నేతలు, పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఎందుకంటే ఆ కుటుంబంలో ఉన్నది అయిదో పదో ఓట్లు కాదు ఏకంగా 350 ఓటర్లు ఉన్నారు. దీంతో ఆ కుటుంబాన్ని తమ వైపు తిప్పుకుంటే గంపగుత్తగా 350 ఓట్ల తమ ఖాతాలో జమ అవుతాయని నేతలు భావిస్తున్నారు.

ప్రస్తుతం లోక్ సభ ఎన్నికలు  రావడంతో అస్సాంలోని తేజ్ పూర్ నియోజకవర్గంలో గల నేపాలీ పామ్ గ్రామం వార్తల్లోకి ఎక్కింది. ఎందుకంటే .. తేజ్ పూర్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న అభ్యర్ధులు, నేతలు ప్రస్తుతం ఈ నేపాలీ పామ్ గ్రామానికి క్యూ కడుతున్నారు. ఆ గ్రామం మొత్తం ఒకే కుటుంబం నివసిస్తుంది.

రాన్ బహదూర్ థాపా అనే గోర్ఖా అస్సొంలోని సోనిత్ పూర్ జిల్లాలో స్థిరపడ్డారు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించే రాన్ బహదూర్ థాపా కు మొత్తం అయిదుగురు భార్యలు కాగా..12 మంది కుమారులు, పది మంది కుమార్తెలు ఉన్నారు. అయితే రాన్ బహదూర్ థాపా 1997లో మరణించారు. ప్రస్తుతం ఆ కుటుంబం భారీగా విస్తరించింది. రాన్ బహదూర్ థాపా కుటుంబ సభ్యులు మొత్తం కలిపి దాదాపు 1200 మంది ఉంటారు. వారిలో దాదాపు 350 మందికి ఓటు హక్కు ఉంది.

తమ కుటుంబ పెద్దలు ఎవరికి ఓటు వేయాలని చెబితే ఆ కుటుంబ సభ్యులు మొత్తం వారికే ఓటు వేస్తారు. ప్రస్తుతం ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా .. రాన్ బహదూర్ థాపా పెద్ద కుమారుడు టిల్ బహదూర్ థాపా ఉన్నారు. అంతే కాకుండా నేపాలీ పామ్ గ్రామ అధిపతిగా కూడా టిల్ బహదూర్ థాపానే ఉన్నారు.

దీంతో రాన్ బహదూర్ థాపా కుటుంబానికి చెందిన 350 ఓట్లను తమ వైపు తిప్పుకునేందుకు అభ్యర్ధులు, పార్టీల నేతలు ..టిల్ బహదూర్ థాపాతో మంచి సంబంధాలు కొనసాగిస్తూ ఉంటారు. ఈ గ్రామం సోనిత్ పూర్ పార్లమెంటరీ నియోజకవర్గంలోని రంగపర అసెంబ్లీ సిగ్మెంట్ పరిధిలోకి ఉంది.

దివంగత రాన్ బహదూర్ థాపా కుమారుడు, నేపాలీ పామ్ గ్రామ గ్రామాధిపతి టిల్ బహదూర్ థాపా ఈ సందర్భంగా స్పందిస్తూ .. తమ కుటుంబంలో దాదాపు 350 మంది ఓటు వేయడానికి అర్హులు ఉన్నారని చెప్పారు. తమ తండ్రి 1964 లో తాతయ్యతో పాటు ఇక్కడకు వచ్చి స్థిరపడ్డారని తెలిపారు. మా నాన్నకు అయిదుగురు భార్యలు కాగా.. మాకు 12 మంది సోదరులు మరియు 9 మంది సోదరీమణులు ఉన్నారు అని చెప్పారు.

తమ కుటుంబం విస్తరించిన తర్వాత ఇప్పుడు పిల్లలందరినీ లెక్కించినట్లయితే మొత్తం 1200 మందికి పైగా కుటుంబ సభ్యులు ఉంటారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేటికీ తమ కుటుంబానికి అందడం లేదని వాపోయాడు. తమ పిల్లలు ఉన్నత చదువులు చదివారు కానీ ప్రభుత్వ ఉద్యోగాలు రాలేదన్నారు. దీంతో తమ కుటుంబంలోని చాలా మంది బెంగళూరు వెళ్లి ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుంటున్నారని చెప్పారు. 1989 నుండి తాను గ్రామ ప్రథాన్ గా పని చేస్తున్నట్లు తెలిపారు.

Chandrababu: గాజువాక చంద్రబాబు సభలో రాయి దాడి  

Related posts

Breaking: ఇరాన్ అధ్యక్షుడి హెలికాఫ్టర్ కు ప్రమాదం..!

sharma somaraju

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

sharma somaraju

Human Trafficking Rocket: హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు ..లక్షల్లో జీతాలంటూ విదేశాలకు యువకుల తరలింపు

sharma somaraju

JD Lakshminarayana: జగన్ విదేశీ పర్యటనపై జేడీ లక్ష్మీనారాయణ కీలక కామెంట్స్

sharma somaraju

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ .. కానీ..

sharma somaraju

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద మృతి

sharma somaraju

Arvind Kejrival: ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన సీఎం కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

sharma somaraju

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Fire In Flight: ఆకాశంలో ఉండగానే మరో ఎయిర్ ఇండియా విమానంలో మంటలు ..బెంగళూరులో అత్యవసర ల్యాండింగ్

sharma somaraju

దెందులూరులో టీడీపీ ప్ర‌భాక‌ర్ గెలిచేస్తాడా… వైసీపీ అబ్బ‌య్య చౌద‌రి గెలుస్తాడా ?

ఇది క‌దా.. చంద్ర‌బాబుకు – జ‌గ‌న్ బాబుకు తేడా ఇదే…!

టీడీపీలో త‌మ్ముడి దెబ్బ‌తో కూతురికి బిగ్ షాక్ త‌గ‌ల‌బోతోందా ?

ఉండిలో దంచేశారు.. ర‌ఘురామ‌కు ద‌డ‌ద‌డ‌.. గ‌డ‌బిడే…?