NewsOrbit
న్యూస్

Lokayukta: మచ్చను మాపుకున్న లోకాయుక్త!కృష్ణపట్నం మందు పంపిణీ ఆపమనలేదని వివరణ!

Lokayukta: ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారిన అంశం ఏదైనా ఉందంటే అది కరోనా చికిత్సకు నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య ఇస్తున్న మందే.వైద్యం మూలికలు మరికొన్ని ఇతర ముడి పదార్థాలతో ఆనందయ్య ఈ మందును తయారుచేసి కరోనా నిరోధానికి ,ఒకవేళ వస్తే ఆ వ్యాధి తగ్గడానికి ప్రజలకు ఉచితంగా ఇస్తున్నారు.

Lokayukta Gives clarification about krishnapatnam medicine issue
Lokayukta Gives clarification about krishnapatnam medicine issue

ఇప్పటికే ఇరవై వేల మందికి పైగా ఆ మందును వాడారు. అందరూ సురక్షితంగా ఉన్నారు.ఆ మందు బాగా పనిచేస్తోందని, కరోనా తగ్గుతోందని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరగడంతో అన్ని దారులు కృష్ణపట్నం వైపు దారితీశాయి. ఆ గ్రామంలో కిలోమీటర్ల పొడవున్న క్యూలు సైతం ఏర్పడ్డాయి.మందు దొరికితే చాలు బతికినట్టే అన్న భావన ప్రజల్లో బలంగా వ్యాపించింది.అంతా సజావుగా సాగుతున్న సమయంలో ఉన్నట్టుండి జిల్లా అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది.ఈ మందు పై విచారణ అంటూ హడావుడి చేసింది.అధికార యంత్రాంగం ఎందుకని అకస్మాత్తుగా ఈ మందు పై స్పందించింది అన్న అనుమానాలు తలెత్తాయి.ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త జస్టిస్ లక్ష్మణ్రెడ్డి ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం ఈ రకమైన చర్యలు తీసుకుందన్న వార్తలు వచ్చాయి.లోకాయుక్త ఆదేశాల మేరకే జిల్లా కలెక్టర్ ఆరుగురు సభ్యులతో ఉన్నతస్థాయి విచారణ కమిటీని నియమించారని ,మందు పంపిణీని తాత్కాలికంగా నిలిపివేయించారని మీడియాలో ,సోషల్ మీడియాలో రచ్చ అయింది .లోకాయుక్తకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా వచ్చాయి.

లోకాయుక్త స్పందన ఏమిటంటే!

ఈ నేపధ్యంలో మొట్టమొదటిసారిగా లోకాయుక్త శుక్రవారం కృష్ణపట్నం ముందు పై స్పందించారు .చీరాలకు చెందిన న్యాయవాది జర్నలిస్ట్ ,ఆసాది సతీష్ రెడ్డి కృష్ణపట్నం మందు విషయంలో లోకాయుక్తకు ఒక లేఖ రాసి ఈమెయిల్లో పంపగా శుక్రవారం లోకాయుక్త రిజిస్ట్రార్ వివరణ ఇచ్చారు.ఆ మందు పంపిణీని నిలిపివేయమని లోకాయుక్త ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని , ఎలాంటి సుమోటో కేసు కూడా నమోదు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. కేవలం మందు పంపిణీ సమయంలో ఆ గ్రామంలో కరోనా నిబంధనలు అమలయ్యేట్లు చూడమని మాత్రమే లోకాయుక్త కార్యాలయం నెల్లూరు జిల్లా కలెక్టర్ కు సూచించిందన్నారు.ప్రజలకు ఉపయోగపడే దేనిని కూడా లోకాయుక్త అడ్డుకోరని రిజిస్ట్రార్ వివరించారు.దీంతో తనపై పడ్డ మచ్చను లోకాయుక్త మాపుకున్నట్లయి౦ది.

author avatar
Yandamuri

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!