టిడిపి పార్టీ లో హాట్ టాపిక్ అయిన లోకేష్, ఎంత పెద్ద మార్పు..??

Share

చంద్రబాబు వారసుడిగా పొలిటికల్ ఫీల్డ్ లో అడుగు పెట్టిన నారా లోకేష్ పై పార్టీ క్యాడర్ మరియు వివిధ పార్టీల నాయకులు అనేక అంచనాలు పెట్టుకున్నారు. కానీ లోకేష్ అంచనాలు అందుకోలేక చాలా సందర్భాలలో నవ్వుల పాలు అవ్వడం జరిగింది. పార్టీ పదవి ద్వారా రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన లోకేష్.. 2019 ఎన్నికల్లో మొట్టమొదటిసారి ప్రజాక్షేత్రంలో పోటీ చేసి ఓడిపోవడంతో ఆయనపై భారీ స్థాయిలో విమర్శలు సొంత పార్టీలో ఉన్న నాయకులే చేయడం జరిగింది.

Chandrababu Naidu, Lokesh extend support to Pattabhi, whose car was vandalisedపార్టీని ముందుకు నడిపించడంలో లోకేష్ ఏమాత్రం సరిపోడు అని, ఆయన రాజకీయాల్లో రాణించ లేడని బాబు కి తగ్గ తెలివితేటలు లోకేష్ లో లేవని చాలామంది టిడిపిలో ఉన్న నాయకులే కామెంట్లు చేసినట్లు అనేక వార్తలు ఏపీ రాజకీయ వర్గాల్లో వచ్చాయి. కానీ తాజాగా లోకేష్ వ్యవహారం చూస్తే ఆయనలో చాలా మార్పులు వచ్చినట్లు మాటతీరు పరంగా గానీ ఇతర నాయకులతో మాట్లాడే విషయంలో గానీ కింద క్యాడర్ తో డీల్ చేసే విషయంలో గాని ఆయన వ్యవహరిస్తున్న తీరు పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

 

పార్టీ కేడర్ కి ఎక్కడ సమస్య ఉంటే అక్కడ వాలిపోతున్నారు. ఇటీవల వచ్చిన వరదలు, ఏలూరు సంఘటన, టిడిపి నేతల అరెస్ట్ ఇలా సమస్య ఎక్కడ ఉంటే అక్కడ లోకేష్ రావడం పరామర్శించడం పార్టీ నేతలకు చిన్న బాబు లో కనబడుతున్న మార్పు.. టీడీపీ పార్టీ భవిష్యత్తుపై ఆశలు చిగురించే విధంగా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పార్టీ నేతలతో కార్యకర్తలతో మమేకమవుతూ లోకేష్ పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా మార్పు చెందటం టిడిపి పార్టీ వర్గాలలో సంతోషాన్ని కలిగిస్తుంది. పర్యటన ఏదైనా సమస్య తీవ్రత బట్టి అధికార పార్టీని రాజకీయ విమర్శలతో ఇరుక్కున కూడా పెడుతున్నారు. దీంతో ప్రస్తుతం వ్యవహరిస్తున్న లోకేష్ కొత్తలో వచ్చిన లోకేష్ కి చాలా మార్పు వచ్చిందని టిడిపి నాయకులు డిస్కషన్లు చేసుకుంటున్నారట. ఏది ఏమైనా లోకేష్ లో వచ్చిన చురుకుదనం పార్టీ కేడర్లో మంచి జోష్ నింపుతున్నట్లు ఏపీ రాజకీయ వర్గాల్లో టాక్ వస్తోంది.


Share

Related posts

తెలంగాణ లో కొత్త లొల్లి… అటాక్ మూడ్ లో కే‌సి‌ఆర్?

CMR

Jaggery: యవ్వనంగా కనిపించాలంటే ప్రతిరోజు దీనిని తినాలి..!!

bharani jella

పైరసీ చేసే ఆ సైట్ కి సూపర్ షాక్ ఇచ్చిన అమెజాన్!

Teja