NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

రోజు రోజుకి టీడీపీలో పడిపోతున్న లోకేష్ గ్రాఫ్..!!

తెలుగు రాజకీయాల్లో మాత్రమే కాక జాతీయ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఇప్పుడు చాలా దయనీయంగా మారింది. రాష్ట్ర విభజన దెబ్బకు తెలంగాణలో అడ్రస్ లేకుండా పోయిన టిడిపి పార్టీ పరిస్థితి… 2019 ఎన్నికల ఫలితాల దెబ్బకి ఏపీలో కూడా అడ్రస్ గల్లంతు కావటం గ్యారెంటీ అన్న టాక్ వినపడుతోంది. చంద్రబాబు వయసు మీద పడటం తో పాటు గట్టిగా తుమ్మితే ఊడిపోయే ముక్కులా.. ప్రతిపక్ష హోదా ఉండటంతో టిడిపి పార్టీ పరిస్థితి చాలా దయనీయంగా మారింది. ఇదిలా ఉండగా చంద్రబాబు తనయుడు నారా లోకేష్ కి పార్టీలో రోజురోజుకీ ప్రాధాన్యత తగ్గుతున్నట్లు ఏపీ రాజకీయాల్లో టాప్ గట్టిగా వినపడుతోంది.

Andhra Pradesh CM Chandrababu Naidu's son Nara Lokesh sworn in as state cabinet minister - India Newsఎలాగైనా తన వారసత్వాన్ని లోకేష్ చేతిలో పెట్టాలని.. చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ లోకేష్ రాకను… టిడిపిలో ఉన్న కీలక నాయకులు అడ్డుకుంటున్న ట్లు అంతర్గతంగా వినబడుతున్న టాక్. కనీసం ఎమ్మెల్యేగా కూడా లోకేష్ గెలవకపోవడంతో అటువంటి వ్యక్తికి పార్టీలో కీలకమైన పదవుల్లో కూర్చోబెడితే ఊరుకునే ప్రసక్తి లేదని టీడీపీ లో ఉన్న నేతలు తిరగబడే రీతిలో వ్యవహరించడంతో చంద్రబాబు ఇటీవల పార్టీకి సంబంధించి కీలకమైన పదవులకు లోకేష్ ని పరిగణలోకి తీసు కొన్నట్లు టాక్ వస్తోంది. టీడీపీలో తల పండిపోయిన రాజకీయ నేతలు సీనియర్లు కనీసం ఎమ్మెల్యేగా గెలవలేని వ్యక్తిని మా మీద పెత్తనం చెలాయించే రీతిలో బాధ్యత తప్పు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని కరాఖండిగా చెప్పటంతో చంద్రబాబు… లోకేష్ విషయంలో వెనక్కి తగ్గినట్లు సమాచారం.

 

ఏదిఏమైనా నారా లోకేష్ ని బలమైన రాజకీయ నేతగా చూడాలనుకుంటున్న చంద్రబాబుకు మాత్రం సొంత పార్టీ నుండి వ్యతిరేకత రావటంతో లోకేష్ పొలిటికల్ కెరీర్ విషయంలో బాబు అంతర్మథనంలో పడినట్లు సమాచారం. మరోపక్క తనని తాను రాజకీయ నాయకుడిగా నిరూపించుకోవాలని ఇటీవల వరదలు వచ్చిన క్రమంలో లోకేష్ చేసిన ప్రయోగాలు బెడిసి కొట్టడంతో పాటు నవ్వులపాలు కావటంతో …చిన్న బాబు గ్రాఫ్ పార్టీలో రోజురోజుకీ తగ్గుముఖం పడుతున్నట్లు..ఇదే పరిస్థితి రాబోయే రోజుల్లో కొనసాగితే లోకేష్ పొలిటికల్ గా రిటైర్మెంట్ తీసుకుంటే బెటర్ అనే టాక్ స్వయంగా టిడిపి పార్టీ ముందే వినబడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju