NewsOrbit
న్యూస్

లోకేష్ లాజిక్ జగన్ కు ప్రత్యేకం… మిగిలిన వారికి నో కామెంట్!!

కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని వణికించేస్తోన్న సంగతి తెలిసిందే! అగ్రరాజ్యాలు, ధనిక దేశాలు శైతం అల్లల్లాడిపోతున్నాయి.. ఆర్ధికంగా చితికిపోయే పరిస్థితికి చెరిపోతున్నాయి. ప్రపంచం సంగతి అలా ఉంటే… ఇక భారతదేశం విషయానికొచ్చే సరికి పదమూడున్నర లక్షల కేసులు ఇప్పటివరకూ నమోదవగా…ఎనిమిది లక్షలమందికి ఇప్పటికే నయమైపోయింది. సుమారు నాలుగు లక్షల ఏభై ఐదు వేల కేసులు ప్రస్తుతం ఉన్నవి! ఇక మరణాల సంగతి చూసుకుంటే… ప్రపంచం మొత్తం మీద మరణాల సంఖ్య సుమారు ఆరున్నర లక్షలు ఉండగా… భారతదేశంలో ముప్పైఒక్క వేలు దాటింది! ఈ చావులన్నింటికీ ఎవరు కారణం… ఇదే లోకేష్ ప్రశ్న!

కరోనా అనేది ప్రపంచ సమస్య.. ఇది ప్రతీ దేశ సమస్య.. ప్రతీ రాష్ట్ర సమస్య! మరి కేవలం ఏపీలోనే కరోనా ఉందన్నట్లుగా లోకేష్ ఎందుకు మాట్లాడుతున్నారు? కారణం… ఏపీ గురించి తప్ప మరే రాష్ట్రం గురించి అవగాహన లేకపోవడమా.. కరోనాను కూడా రాజకీయంగా వాడేసే వ్యూహమా… చినబాబుకే తెలియాలి! అవును… ఏపీలో జరుగుతున్న కరోనా మరణాలన్నింటినీ ప్రభుత్వ హత్యలుగానే పరిగణించాలని చెప్పుకొస్తున్నారు నారా లోకేష్. జాతీయ స్థాయిలో చక్రాలు గట్రా తిప్పిన చంద్రబాబు కుమారుడికి… పక్క రాష్ట్రాల్లో, దేశం మొత్తంమీద ఏమి జరుగుతుందో తెలియక పోవడం నిజంగా ఆశ్చర్యకరమే!

కరోనా విషయంలో అశ్రద్ధ చూపుతున్నారు.. టెస్టుల సంఖ్య పెంచడం లేదు.. కరోనా మృతుల పట్ల బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారు.. అన్న విమర్శలు దేశంలోని చాలా రాష్ట్రాలే ఎదుర్కొంటున్నాయి! కానీ… పై అన్ని విషయాల్లోనూ శ్రద్ధ తీసుకుంటూ.. దేశంలోని మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నారన్న పేరు సంపాదించుకున్నారు జగన్ సర్కార్. దీంతో… టీడీపీ తో పొత్తు పెట్టుకున్న పార్టీల నేతలు కూడా.. కరోనా విషయంలో జగన్ తీసుకుంటున్న శ్రద్ధ పట్ల అభినందనలు తెలియజేస్తుంటే… లోకేష్ మాత్రం ఏపీలో కరోనా మరణాలను జగన్ ఖాతాలో వేస్తామంటున్నారు.. ప్రభుత్వ హత్యలుగా పరిగణించాలంటూన్నారు!!

ఈ లెక్కన చూసుకుంటే… ఈ సూత్రం అందరికీ అప్లై చేస్తే… దేశంలో ఇప్పటివరకూ నమోదైన 31,358 మరణాలు మోడీ ఖాతాలో వేసెయ్యోచన్న మాట! మాహారాష్ట్రలోని 13,132 మరణాలను ఉద్ధవ్ థాక్రే ఖాతాలో.. ఢిల్లీలోని 3,777 మరణాలకు కేజ్రీవాల్ ఖాతాలో.. తమిళోనాడులోని 3,320 మరణాలను పలనస్వామి ఖాతాలో.. కర్నాటకలోని 1,724 మరణాలను యాడ్యురప్ప ఖతాలో.. ప్రస్తుతం ఏపీని కంటే హైదరాబాద్ సేఫ్ అని అక్కడే తలదాచుకుంటున్న లోకేష్ కు అక్కడి పరిస్థితుల గురించి ప్రత్యేకంగా చెప్పాలా? తెలంగాణలోని కరోనా మరణాలను కేసీఆర్ ఖాతాలో.. ఇలా వేసుకుంటూపోతే? లోకేష్ కే తెలియాలి.

ఈ జ్ఞానలోపం వల్ల ట్విట్టర్ లో టైప్ చేస్తున్నాప్పుడో, కనీసం పోస్ట్ చేస్తున్నప్పుడో అయినా పునరాలోచించుకునే ఆలోచన లోకేష్ చేయకపోవడం.. ఫలితంగా ఇరుక్కోవడం.. ఆయన అభిమానులను కలచివేస్తోంది!

Related posts

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju