NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

లోకేష్‌కు దొరికిపోయిన జ‌గ‌న్!?

ఏపీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డిని టార్గెట్ చేయ‌డంలో ప్ర‌తిప‌క్ష తెలుగుదేశం పార్టీ అవ‌కాశం కోసం ఎదురు చూస్తూ ఉంటుంద‌నే విష‌యంలో ఎలాంటి సందేహం, చ‌ర్చ అవ‌స‌రం లేదు.

అలాంట‌ప్పుడు వైఎస్ జ‌గ‌న్ ఒకింత జాగ్ర‌త్త‌గా ఉండాలి. ఇంకా చెప్పాలంటే సున్నిత‌మైన విష‌యాల్లో మ‌రింత శ్ర‌ద్ధ వ‌హించాలి. అయితే, అలా చేయ‌క‌పోవ‌డం వ‌ల్ల విప‌క్ష తెలుగుదేశం పార్టీకి దొరికిపోయారు. ఇంకేముంది టీడీపీ యువ‌నేత నారా లోకేష్ ఆయ‌న్ను ఓ రేంజ్‌లో ఆడుకున్నారు.

జ‌గ‌న్ చేసిన ప‌నికి…

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తిరుమ‌ల‌లో ప‌ర్య‌టించిన సంగ‌తి తెలిసిందే. టీటీడీ పర్యటనలో రేణిగుంట ఎయిర్ పోర్టులో సీఎం జగన్ తో ఫోటో కోసం ఇద్దరు వ్యక్తులు మాస్క్ పెట్టుకుని వచ్చినపుడు మాస్క్ తీసేయాలని జగన్ చెప్పినట్లుగా ఉన్న‌ వీడియోను లోకేష్ తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసి నారా లోకేష్ ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్రంలో లక్షల్లో కరోనా కేసులు, వేల సంఖ్యలో ప్రజల చనిపోతుంటే.. జగన్ మూర్ఖత్వానికి మానవ రూపంగానే మిగిలిపోయారని మండిప‌డ్డారు. సీఎం జగన్ మాస్క్ పెట్టుకోరు, వేరే వాళ్ళు పెట్టుకుంటే ఊరుకోరు అంటూ ఓ రేంజ్‌లో టార్గెట్ చేశారు. దళిత యువకుడు కిరణ్ ని మాస్క్ పెట్టుకోలేదని కొట్టి చంపడం ఎందుకు? అని ప్రశ్నించారు. పోలీస్ స్టేషన్ లో కిరణ్ ని చంపింది మాస్క్ వేసుకోలేదనా? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా?అని లోకేష్ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

 

వైసీపీ ఎంపీ కూడా వ‌చ్చేశారు మ‌రి

మ‌రోవైపు వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సైతం ఈ ఉదంతంపై స్పందించారు. ముఖ్యమంత్రి తిరుమలలో మాస్క్ పెట్టుకోలేదు అని త‌ప్పుప‌ట్టారు. ముఖ్యమంత్రిని చూసి ఫాలో అయ్యేవారు చాలామంది ఉంటారని చురకలు అంటిచారు. ముఖ్యమంత్రి ఆదర్శవంతుడిగా ఉండాలి కానీ, వేలెత్తి చూపే వాడిగా ఉండొద్దని ఎద్దేవా చేశారు. ఇక డిక్లరేషన్ వివాదంపై కూడా స్పందిస్తూ డిక్ల‌రేష‌న్‌ ఇవ్వకుండా సీఎం జగన్‌ తిరుమల ఆలయానికి వెళ్లడం దురదృష్టకరమని మండిప‌డ్డారు. ఆచారాన్ని గౌరవించమని కోరిన‌ప్ప‌టికీ ఏపీ సీఎం ప్రభుత్వ నిబంధనను ఉల్లంఘించారని ర‌ఘురామ కృష్ణంరాజు మండిపడ్డారు. కాగా, ఇటు తెలుగుదేశం పార్టీ, అటు సొంత ఎంపీ చేసిన విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో వైసీపీ నేతలు లేదా ప్ర‌భుత్వ పెద్ద‌లు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

author avatar
sridhar

Related posts

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju