న్యూస్ సినిమా

రామ్ చరణ్ తో లోకేష్..!!

Share

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో “RRR” చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో ముగింపు దశకు చేరుకుంది. మిగతా షూటింగ్ విజువల్ ఎఫెక్ట్స్ కావటంతో చరణ్ నెక్స్ట్ సినిమా ఏంటి అన్న దానిపై టాలీవుడ్ ఇండస్ట్రీలో రకరకాల వార్తలు వినపడుతున్నాయి.

Lokesh Kanagaraj – Tamil film director of 'Maanagaram' and 'Kaithi' fame –  My Words & Thoughtsమరోపక్క చరణ్.. కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాలో కూడా చేసిన సంగతి తెలిసిందే. ఇది కాకుండా నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో రామ్ చరణ్ ఎవరికి అవకాశం ఇస్తారు అన్నది ఇంకా ఎవరికీ క్లారిటీ లేదు. ఇటువంటి తరుణంలో కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రామ్ చరణ్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చినట్లు క్లారిటీ ఇచ్చారు.

 

చరణ్ కు స్టోరీ లైన్ నెరేట్ చేశానని త్వరలో స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేస్తానని చెప్పాడు లోకేష్. అంతమాత్రమే కాకుండా ప్రస్తుతం లోకేష్ కమల్ హాసన్ హీరోగా విక్రమ్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. దీంతో కమల్ సినిమా అయినా వెంటనే రామ్ చరణ్ సినిమాకి సంబంధించి లోకేష్ ప్రాజెక్టు అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి.


Share

Related posts

కన్‌ఫ్యూజన్ లో దిల్ రాజు ..!

GRK

Romance: శృంగార  సమయం లో లైట్ ఆఫ్ చేస్తున్నారా?అయితే  ఈ మార్గాన్ని ఎంచుకోండి!!

siddhu

Relationship tips : శృంగారం లో చాలా మంది కి వచ్చే డౌట్స్ ఇవే!!

Kumar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar