NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

అసలు సిసలైన కుంభకోణంలో బయటపడ్డ లోకేష్ పేరు..??

వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అక్రమాలు అన్నిటిని వెలుగులోకి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే అమరావతి భూముల కొనుగోలు విషయంలో జరిగిన అవినీతిని బయట పెట్టడానికి జగన్ సర్కారు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి.. జరిగిన అవినీతిని ఒక నివేదిక రూపంలో సీఐడి అధికారులకు ఇవ్వటం అందరికీ తెలిసిందే.

Lokesh Responds On Pappu Comments! | Gulte - Latest Andhra Pradesh, Telangana Political and Movie News, Movie Reviews, Analysis, Photosసీఐడి జరిపిన విచారణలో అమరావతి విషయంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని, దీనిలో లోకేష్ అదే విధంగా చంద్రబాబు నాయుడు పాత్ర ఎంత ఉంది అనే ఆధారాలతో సహా వివరాలను హైకోర్టు ముందు ఉంచడం జరిగింది. ఈ క్రమంలో న్యాయస్థానం ముందు భూములు కొనుగోలు విషయంలో చంద్రబాబు, లోకేష్ లకు సంబంధించి వాట్సాప్ సంభాషణల వివరాలను న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చినట్లు టాక్.

 

అమరావతి రాజధానిగా ప్రకటించక ముందే లోకేష్, చంద్రబాబు ఇద్దరూ తమకు అత్యంత సన్నిహితంగా ఉండే ఓ డాక్టర్ కి అదేవిధంగా మరొకరికి భూములను రాజధాని ప్రాంతంలో కొనుగోలు చేసే రీతిలో వెనక నుండి కథ నడిపించినట్లు వాటికి సంబంధించిన డాక్యుమెంట్లను కోర్టుకు సమర్పించినట్లు సమాచారం. ఈ విషయాన్ని ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరాం సుబ్రహ్మణ్యం ఇటీవల నిర్ధారణ చేశారు. రాజధాని అమరావతి భూములను కొనుగోలు చేయడానికి అమెరికా నుండి కూడా పెద్ద ఎత్తున టిడిపి ఐ యాం లో నిధులు తప్పించినట్లు అనుమానం వ్యక్తం చేస్తూ వాటి విషయాలు పూర్తిగా బయటపడాలంటే లోతైన దర్యాప్తు చేయటానికి సిఐడికి ప్రత్యేక అనుమతులు ఇవ్వాలని కోరారు. మరోవైపు భూములు కొనుగోలు చేసిన వ్యక్తి లాయర్ మాట్లాడుతూ రాజధాని ప్రాంతం కి బయట భూములు కొంటే అది ఇన్సైడర్ ట్రేడింగ్ ఎలా అవుతుందని ప్రశ్నించారు.

అంతేకాకుండా రాజధాని ప్రాంతంలో భూములు కొంటే తప్పేంటి అని కూడా పేర్కొన్నారు. అయితే ఇరు వైపుల వాదనలు విన్న న్యాయమూర్తి.. చివరి లో మాట్లాడుతూ ప్రైవేటు భూముల కొనుగోలు అమ్మకాలు జరిగితే ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏమిటి అంటూ ప్రశ్నించడం జరిగింది. ఇదిలా ఉంటే రాజధాని ప్రకటించక ముందే ఆ ప్రాంతంలో భూములు కొనడం అనేది ఇన్ సైడ్ ట్రేడింగ్ అవుతుందని, అధికారం దుర్వినియోగం చేసినట్లు అని వైసీపీ నేతలు పేర్కొంటున్నారు. ఈ రాజధాని భూ కుంభకోణం లో చంద్రబాబు ని లోకేష్ ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అన్నట్టు అధికార పార్టీ నేతల వైఖరి ఉంది.

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju