చాల మంది పప్పు తింటే బరువు పెరుగుతాము అనే భ్రమలో ఉంటారు.కాని శరీరంలో పేరుకుపోయిన కొవ్వు పప్పు దినుసులు తినడం వల్ల తగ్గుతుందని తాజా అధ్యయనాలు రుజువు చేసాయి. అంతేకాదు, ఇందులోని మెగ్నీషియం, ఫొలేట్ పోషకాలు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. పప్పులో ప్రోటీన్లు పుష్కలం గా ఉండడం వల్ల శరీరానికి శక్తి వస్తుంది.
పప్పు ఆహారం లో తీసుకుంటే మలబద్ధకం తగ్గి, బరువు నియంత్రణ లో కి వస్తుంది. దీనితో పాటు శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కంది పప్పు లో ఫైబర్, ప్రొటీన్, ఎక్కువగా ఉండడం తో పాటు, కొలెస్ట్రాల్, సాచ్యురేటెడ్ ఫ్యాట్ చాలా తక్కువగా ఉంటుంది. మంచి ఆరోగ్యానికి ప్రొటీన్ కారణమైతే, అందులో ఉండే ఫైబర్ శరీరం నుండి కొవ్వుని ని బైటికి పంపడం లో సహాయం చేస్తుంది. కంది పప్పు తో కంది పచ్చడి, ముద్దపప్పు, కంది పొడి లాంటి వంటకాలు తేలికగా చేసుకోవచ్చు. ఇంతటి రుచికర మైన పప్పు తింటూ కూడా బరువు ను తగ్గించుకోవచ్చు.
ఎర్ర కంది పప్పు తిన్నాక చాలా సేపటి వరకూ పొట్ట నిండుగా ఉండి త్వరగా ఇంకేమీ తినాలనిపించదు. ఒక కప్పు మసూర్ దాల్ ( ఎర్ర కంది పప్పు)లో శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ ఉన్నాయి. ఇందులో ఉండే ఎసెన్షియల్ ఎమైనో ఆసిడ్స్, విటమిన్, బీ1 బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి.
పెసలు,లేదా పెసర పప్పు లో ప్రొటీన్ సమృద్ధి గా ఉంటుంది.దీనితో పాటు అందులో ఉండే ఫైబర్ అధిక బరువు ఉన్న వారికి బాగా ఉపయోగ పడుతుంది. రాత్రి పూట కేవలం పెసర పప్పు కిచిడీ తింటూ బరువు తగ్గవచ్చు . ఇంకా ఎందుకు ఆలస్యం రుచికరమైన పప్పు తో మీ డైట్ ప్రాంభించేయండి మరి!