smart phone: స్మార్ట్  ఫోన్ వలన కొత్తగా వస్తున్న సమస్యలు  ఇవే… ఇలాంటి లక్షణాలు  మీలో కూడా ఉంటే మాత్రం నిర్లక్ష్యం చేయకండి !!(పార్ట్ -2)

Share

smart phone:`ఏదో కోల్పోతున్నామ‌నే భావ‌న‌లో జ‌నాలు అస్తమానం  ఫోన్లు చెక్ చేసుకుంటారని నిపుణులు తెలియచేస్తున్నారు. అందుకే, ఫేస్‌బుక్,వాట్సాప్‌, ఇన్స్ట లాంటి ఇత‌ర యాప్స్‌ని ఎప్పుడూ ఓపెన్ చేసి చూస్తూనే  ఉంటారనితెలియచేస్తున్నారు. జరిగిన ఈ  అధ్యనం లో తెలిసిన  దాని  ప్ర‌కారం త‌ర‌చుగా స్మార్ట్ ఫోన్లు వాడే 45 శాతం మందికి వారి ఫోన్లుఅస్తమానం  చెక్ చేసుకోవాల‌ని కోరికపుడుతుంటుంది.

ఇక ఈ స్ట‌డీలో భాగం అయినా స‌గం మందిలో వారికి ఉన్న  ఒత్తిడికి కార‌ణం వారి ఫోన్లేన‌ని తెలియచేసారు. అయితే నార్మల్ ఫోన్లు వాడుతున్న‌వారిలో ఇలాంటి ప‌రిస్థితి కనబడలేదట. వీళ్ల‌లో 22 శాతం మంది మాత్ర‌మే అస్తమానం  వారి ఫోన్ల‌ను చెక్ చేసుకోవాల‌ని అనుకుంటున్నారు. కేవ‌లం 20 శాతం మందిలోనే వారిలోని ఒత్తిడికి ఫోన్ కారణమవుతుంది అని తెలుస్తోంది.సెల్ ఫోన్‌పై ఎక్కువ‌ సమయం గడపడం  వ‌ల్ల ఆందోళ‌న , ఒత్తిడి ఏర్ప‌డ‌టం గానీ,అవి  ఎక్కువ కావ‌డం గానీ జ‌రుగుతుంద‌ని తెలుస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్‌, నార్మల్  ఫోన్లు వాడుతున్న వారి మ‌ధ్య నిద్ర అలవాట్లు ప‌రిశీలించిన‌ప్పుడు స్మార్ట్ ఫోన్లు వాడే వారు రోజులో ఎక్కువ సార్లు ప‌ళ్లు కొరుకుతున్నార‌నీ, నార్మల్  ఫోన్లు వాడే వారిలో ఆరు శాతం మందికే ఈ అల‌వాటు ఉంద‌ని అంటున్నారు

ఈ స్ట‌డీ నిర్వ‌హించిన పరిశోధకుల స‌ర్వేలో వ‌చ్చిన ఫ‌లితాల‌ను బ‌ట్టి..  సోషల్ మీడియా  వాడటాన్ని త‌గ్గించాల‌ని సూచిస్తున్నారు. ఫోన్లు ఎక్కువ‌గా వాడటం  వ‌ల్ల మనిషి మీద నెగెటివ్ ప్ర‌భావం పడుతుంది అని తెలియచేసారు.  జీవితం లో టెక్నాల‌జీ అవ‌స‌ర‌మే, ముఖ్య‌మైన‌దే కానీ దాని వాడ‌కం మ‌న శ‌రీరంపైన‌, మెద‌డుపైనా నెగెటివ్ ప్ర‌భావాన్ని చూపకుండా లిమిట్స్ లో వాడాలని అప్పుడే టెక్నాల‌జీ అన్ని విధాలా ఉపయోగ పడుతుంది అని తెలియచేస్తున్నారు.


Share

Related posts

బ్రేకింగ్: జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

Vihari

మోదీజీ ఇలా చేశారేంటి..క‌రోనా కాటేయ‌క త‌ప్ప‌దా?

sridhar

Viral Photo : వరంగల్ జిల్లాలో అరుదైన దృశ్యం.. ఓ లుక్కేయండి..!!

bharani jella